Skip to main content

Schools and Colleges Holidays 2025 Announcement : 2025లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు... ఏఏ నెల‌లో...

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : రానున్న కొత్త ఏడాదిలో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి.
AP All Schools and Colleges Holidays 2025   2025 school and college holiday schedule announcement  State government holiday list for 2025 calendar year Holiday announcement for schools and colleges in 2025  2025 holiday list for schools and colleges in the state

అలాగే ఏఏ నెల‌లో ఎన్ని రోజులు హాలిడేస్ రానున్నాయో.. మొద‌లైన వివ‌రాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2025 క్యాలెండర్‌ సంవత్సరానికి సంబంధించి సాధారణ సెలవులు, ఆప్షనల్‌ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఈ మేర‌కు డిసెంబ‌ర్ 7వ తేదీన (శుక్రవారం) విడుదల చేసింది. 

మొత్తం 23 సెలవులు ఇలా..
2025కు సంబంధించి మొత్తం 23 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు రిపబ్లిక్‌ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండుగలు ఆదివారంలో కలిసిపోవడంతో నికరంగా 19 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. అదే విధంగా అక్టోబర్‌ 2 గాందీజయంతి, విజయదశమి రెండూ కలిసిపోయాయి. 

➤☛ Constable Success Story : మా ఊరి నుంచి ఫ‌స్ట్‌ పోలీస్‌ అయ్యింది నేనే.. కానీ..!

21 ఆప్షనల్‌ హాలిడేస్‌ను..
పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునే విధంగా 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్‌–ఈ– గదర్, మహలాయ అమావాస్యలు ఆదివారంతో కలిసిపోయాయి. మొత్తం 12 నెలల్లో 10 నెలల్లో సెలవులు ఉండగా మే, నవంబర్‌ నెలల్లో ఎటువంటి సెలవులు లేవు. 

➤☛ Junior Civil Judge Topper Success Story : ఇక్కడ మిస్సయినా.. అక్క‌డ‌ టాపర్‌గా నిలిచానిలా... కానీ..

ఎక్కువ రోజులు సెల‌వులు ఇలా..
జనవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో అత్యధికంగా నాలుగేసి రోజులు సెలవులు వచ్చాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ద్వారా 20 సాధారణ సెలవులను ప్రకటించింది. నెలవంక దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీతో పాటు ఇతర హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రచార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

➤☛ Red Bus Founder Success Story : నాడు 5 ల‌క్ష‌ల‌తో ప్రారంభం.. నేడు 6000 కోట్లతో.. రెడ్ బ‌స్ యాప్ ఫౌండ‌ర్ స‌క్సెస్ స్టోరీ ఇదే..

స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే..
ఈ సెల‌వులు అన్ని స్కూల్స్‌, కాలేజీలకు దాదాపు వ‌ర్తించ‌నున్నాయి. భారీ వ‌ర్షాలు, బంద్‌లు, కొన్ని అనుకొని సెల‌వులకు స్కూల్స్‌కు హాలిడేస్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే :
జ‌న‌వ‌రి 2025 :
➤☛ నూతన సంవత్సరం – 01
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 07 Dec 2024 12:42PM

Photo Stories