Skip to main content

Sankranti Holidays 2025 News : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌... ఈ సంక్రాంతికి 3 రోజులే సెలవులు... కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : విద్యార్థుల‌కు ఒక ద‌స‌రా త‌ర్వాత ఎక్కువ రోజులు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చేది ఒక సంక్రాంతి పండ‌గ‌కి మాత్ర‌మే. ఈ పండ‌గ‌ను తెలుగు వారు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు.
Sankranti Holidays 2025  Sankranti holidays shortened for students due to upcoming public exams

కానీ ఈ సారి విద్యార్థులకు సంక్రాంతి సెల‌వులు విష‌యంలో నిరాశ ఎద‌రురైంది. ఎందుకంటే... మార్చి నెల‌లో ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో సంక్రాంతి సెల‌వులను భారీగా త‌గ్గించింది.

➤☛ Download AP SSC 10th Class New Syllabus 2025

పబ్లిక్‌ హాలిడేలు మినహా..
అయితే ఏపీ విద్యాశాఖ అధికారులు పబ్లిక్‌ హాలిడేలు మినహా ఆదివారాలతో సహా  విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రణాళికలో సూచించింది. ఇందుకు అనుగుణంగా వ‌చ్చే జనవరిలో ఇవ్వనున్న సంక్రాంతి సెలవులను కూడా భారీగా తగ్గించింది. దీంతో పదో తరగతి విద్యార్ధులకు జనవరి 13, 14, 15 తేదీలలో మాత్రమే సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజులు మినహా మిగతా అన్నిరోజులూ అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. ఏపీలో మాదిరిగా తెలంగాణ‌లో కూడా సంక్రాంతి సెల‌వుల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంది.

➤☛ ఇదీ చదవండిAP 10th Class Model Papers 2025

మార్చి 15వ తేదీ నుంచి..?
మార్చి 15వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న విష‌యం తెల్సిందే. మొత్తం మీద టెన్త్ క్లాసు విద్యార్థులకు ఈ సారి సంక్రాంతి సెల‌వుల విష‌యంలో నిరాశ త‌ప్ప‌దు.

సంక్రాంతి సెలవుల్లో సైతం..
సంక్రాంతి సెలవుల్లో సైతం టెన్త్ విద్యార్ధులు ఇంటి వద్ద చదువుకునేలా మార్గదర్శకం చేయాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు సూచించింది. మరోవైపు పదోతరగతి సిలబస్‌ పూర్తి కానందున ఈ షెడ్యూల్‌ను సైతం సవరించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఒకవేళ పదో తరగతి టైం టేబుల్ ఛేంజ్‌ చేస్తే మిగతా తరగతులకు మరో టైం టేబుల్‌ అమలు చేయవల్సి వస్తుంది. 

2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

2025 జనవరి  :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ క‌నుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26

ఫిబ్రవరి 2025 : 

☛➤ మహ శివరాత్రి : 26

మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31

ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి :  05
☛➤ శ్రీరామ నవమి :  06
☛➤ అంబేడ్కర్ జయంతి :  14
☛➤ గుడ్ ఫ్రైడే :  18

మే 2025 :
మేడే : 1

జూన్ 2025 :
☛➤ బక్రీద్ :  07

జూలై :  2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21

ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27

సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21

అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20

నవంబర్  2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05

డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26

Published date : 06 Dec 2024 09:31AM

Photo Stories