Sankranti Holidays 2025: స్కూళ్లు బంద్.. నేటి నుంచి సంక్రాంతి సెలవులు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 20న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. సంక్రాంతి సెలవుల్లో పదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫోన్ ద్వారా నిరంతరం అందుబాటులో సందేహాలను నివృత్తి చేయాలన్నారు. మిషనరీ పాఠశాలలకు మాత్రం ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించిందన్నారు. మిషనరీ పాఠశాలలు 16న పునఃప్రారంభమవుతాయన్నారు.
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ, జూనియర్ కళాశాలలకు శుక్రవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీకి సైతం శుక్రవారం నుంచి పీజీ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
కాలేజీలకు ఎప్పటినుంచంటే...
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్య ఇంటర్ జూనియర్ కళాశాలకు 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించినట్లు ఇంటర్మీడియట్ ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. 20వ తేదీ కళాశాలలు పునః ప్రారంభమవుతాయని వివరించారు. అదే రోజు నుంచి 25వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయన్నారు. సెలవుల్లో ఎవరైనాతరగతులు నిర్వహిస్తే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Sankranti holidays
- schools 2025 Sankranti holidays
- telugu news schools 2025 Sankranti holidays
- Sankranti schools 2025 holidays news in telugu
- Sankranti holidays for schools 2025 news in telugu
- holiday calendar 2025
- School Holiday Calendar 2025
- AP and TS Schools Sankranti Holidays January 2025 Telugu
- AP Colleges Sankranti Holidays January 2025
- SankrantiHolidayClarification
- AndhraPradeshEducation
- HolidaySchedule
- sankranti holidays in andhra pradesh
- sankranti holiday news latest
- schools and colleges holdiays
- schools and colleges holdiays 2025
- SankrantiHolidays
- AndhraPradeshSchools
- SankrantiVacation
- HolidayAnnouncement
- SankrantiCelebrations