Skip to main content

Tomorrow schools and colleges holiday declared: రేపు స్కూళ్లకు కాలేజీలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

tomorrow schools and colleges holiday   Telangana government declares holiday for schools and colleges on 27th Telangana students get a holiday on 27th due to elections
tomorrow schools and colleges holiday

తెంలగాణలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో మెదక్-కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటుగా.. నల్గొండ- వరంగల్- ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంంది. 

మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌ శిక్షణ: Click Here

రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు:
ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే 24 కొత్త జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. పోలింగ్ ఉండటంతో ఈ నెల 27న, కౌంటింగ్ జరిగే మార్చి 3న సెలవులు వర్తించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తెలంగాణలో ఈనెల 27న ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్ కోరారు. 

గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులందరికీ అవకాశం కల్పిస్తూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేసిందని గుర్తు చేశారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల్లో ఓటు హక్కు కలిగిన గ్రాడ్యుయేట్లకు కొన్ని గంటలు మాత్రమే ఓటేసేందుకు పర్మిషన్ ఇస్తామని తమ దృష్టికి వచ్చిందన్నారు. 

ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు స్కూళ్లు, కాలేజీలకు చెందిన యాజమాన్యాలు.. ఓటు కలిగిన సిబ్బందికి రోజంతా సెలవు ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు క్యాలెండర్ ఇయర్‌లో అందించే సెలవులకు సంబంధం లేకుండానే పోలింగ్ రోజున అదనపు సెలవు దినంగా అవకాశం ఇవ్వాన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
 

Published date : 27 Feb 2025 08:36AM

Photo Stories