Skip to main content

Half Day Schools and Timings : రేప‌టి నుంచే ఒంటిపూట బ‌డులు ప్రారంభం.. పాఠ‌శాల‌ల స‌మ‌యం ఇదే.. ఇక వేస‌వి సెల‌వులు కూడా..!!

రాష్ట్రంలోని ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా విద్యాల‌యాలకు స‌ర్కార్ ఒంటి పూట బ‌డుల‌ను ప్ర‌క‌టించింది. దీంతో, విద్యార్థులు కేవ‌లం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మాత్ర‌మే బ‌డుల్లో ఉండాల్సి ఉంటుంది.
AP schools half day timings and summer holidays updates in telugu

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలోని ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా విద్యాల‌యాలకు స‌ర్కార్ ఒంటి పూట బ‌డుల‌ను ప్ర‌క‌టించింది. దీంతో, విద్యార్థులు కేవ‌లం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మాత్ర‌మే బ‌డుల్లో ఉండాల్సి ఉంటుంది. దీనిని, స‌మ‌యాన్ని కూడా ప్ర‌క‌టించారు అధికారులు. ప్ర‌స్తుతం, ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి కాబ‌ట్టి.. ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న పాఠ‌శాల‌ల‌కు ఒక స‌మ‌యం, ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ని పాఠ‌శాల‌ల‌కు ఒక స‌మ‌యాన్ని కేటాయించారు. ఇలా అయితే, అటు ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు, త‌ర‌గ‌తుల‌కు హాజ‌రైయ్యే విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌వు అని చెబుతున్నారు అధికారులు.

Hyderabad University in QR Rankings : బెస్ట్ వ‌ర్సిటీల్లో ఒక‌టిగా అరుదైన విజ‌యం.. హైదరాబాద్ వ‌ర్సిటీ ప్ర‌పంచంలోనే బెస్ట్‌.. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో..

బ‌డుల‌కు టైమింగ్స్ ఇలా..

ఏపీలోని పాఠ‌శాల‌ల‌కు ప్ర‌భుత్వం ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ మెర‌కు టైమింగ్స్‌ను కూడా ప్ర‌క‌టించింది. విద్యా శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం, ఈనెల 15 నుంచి అంటే రేప‌టి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌డుల‌కు ఒంటి పూట నిర్వ‌హించి, సాధార‌ణ పాఠ‌శాల‌ల్లో ఉద‌యం 7:45 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు బ‌డులు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.

Assistant Librarian Exam Halltickets To Release: ఈనెల 24, 25న హెల్త్‌ వర్సిటీ అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పరీక్ష..

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించే పాఠ‌శాల‌ల్లో అయితే, మ‌ధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయని వెల్ల‌డించారు. ఈ ఎండ‌ల తీవ్ర‌త వ‌ల్ల ఏపీతోపాటు తెలంగాణ‌లో కూడా ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌కు ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నుంది.

వేస‌వి సెల‌వు ప్ర‌క‌ట‌న‌..

ఇక‌, విద్యార్థుల‌కు త్వ‌ర‌లోనే వేస‌వి సెల‌వులు కూడా ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన ఎండ‌ల తీవ్ర‌త గ‌త నెల ఫిబ్ర‌వ‌రిలోనే ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ అధికారులు వేస‌వి సెల‌వుల ముందు పాఠ‌శాల‌ల‌కు ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే, తాజాగా విద్యార్థుల‌కు ఒంటిపూట బ‌డుల‌కు సంబంధించిన స‌మయాన్ని ప్ర‌క‌టించి వేస‌వి సెల‌వు తేదీల‌ను కూడా ప్ర‌క‌టించారు.

TSPSC Group 3 Results 2025: తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు

అయితే, ఇప్ప‌టికే ముస్లిం పాఠ‌శాల‌ల‌కు రంజాన్ సంద‌ర్భంగా ఒంటిపూట బ‌డుల‌ను ప్రారంభించారు. ఇక‌, ఇప్పుడు ప్రారంభం కానున్న ఒంటిపూట బ‌డుల‌ను వ‌చ్చేనెల ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఆత‌ర‌వాత‌, వేస‌వి సెల‌వు ప్రారంభం అయ్యి.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు కొన‌సాగుతాయి అని స్ప‌ష్టం చేశారు. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి జూన్ 12వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Mar 2025 12:56PM

Photo Stories