Skip to main content

Half Day Schools : మ‌రి కొన్ని రోజుల్లోనే ఒంటిపూట బడులు ప్రారంభం.. కానీ!!

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా.. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి వ‌చ్చేనెల‌ ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బ‌డుల‌ను నిర్వహిస్తారు.
Education department announces half day schools schedule   summerschoolscheduleupdate

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత పెరుగుతోంది. బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇక, పాఠ‌శాల‌ల విష‌యానికొస్తే.. విద్యార్థుల‌కు ఒంటి పూట బడుల‌ను త్వ‌రలోనే ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్లడించారు విద్యాశాఖ అధికారులు. ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసిన విద్యా శాఖ అధికారులు.. ఎండల తీవ్రత కొర‌కు ఒంటిపూట బడుల పై త‌మ‌ నిర్ణయాన్ని ప్ర‌క‌టించారు. ఈ మేరకు పాఠశాలల నిర్వహణ సమయాలను ఖరారు చేశారు.

ప్ర‌తీ రోజు నాలుగున్న‌ర గంట‌లే..

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా.. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి వ‌చ్చేనెల‌ ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బ‌డుల‌ను నిర్వహిస్తారు.

PM Internship Scheme: PM ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ విద్యార్థులకు నెలకు రూ.6వేలు.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..అప్లై చేసుకోండి ఇలా..!

అంటే.. ప్ర‌తీ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠ‌శాల‌ల్లో తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం పరీక్షలు పూర్తయ్యే వరకూ మధ్యాహ్న పూట స్కూల్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ అధికారులు.

ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు..

ఏపీలోని విద్యాల‌యాల్లో మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బ‌డులు ఉంటాయని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, విద్యార్థుల త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విన‌తి ప్ర‌కారం, ఒంటిపూట బ‌డుల‌ను మార్చి 10వ తేదీ నుంచే ప్రారంభించాల‌ని కోరుతున్నారు. రోజురోజుకి ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతూ పోతుంది. ఈ కార‌ణంగా ప్ర‌క‌టించిన తేదీకి మ‌రింత ముందుగానే ఈ ఒంటి పూట బ‌డుల‌ను ప్రారంభించాల‌ని కోరుతున్నారు. ఈ మెర‌కు విద్యాశాఖ క‌స‌ర‌త్తు చేస్తుంది. దీంతో, తెలంగాణ ప్ర‌భుత్వం కూడా విద్యాల‌యాల‌కు ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించాల‌నే ఉద్దేశంతో తేదీ స‌మ‌యం వివరాల‌ను వెల్లడించారు.

Inter English Question Paper Error : 25 నిమిషాలు కోల్పోయిన ఇంట‌ర్ విద్యార్థులు.. ప్ర‌శ్న‌ప‌త్రాల్లో ఇవే లోపాలు..

ఏప్రిల్ నెలాఖ‌రి నుంచే..

ఈ సారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఈసారి వేసవి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రతను గుర్తించి విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే విద్యా శాఖ కు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Mar 2025 01:30PM

Photo Stories