Skip to main content

Half day Schools in Telangana : గుడ్‌న్యూస్.. ఎల్లుండి నుంచే ఒంటి పూట బడులు.. కొత్త టైమింగ్స్ ఇవే... ఎప్ప‌టి వ‌రకు అంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో... ఈ సారి ఎండ‌లు, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో... అన్ని పాఠశాలల్లో 2025 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు ఒంటి పూట బడులను నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది.
Telangana Education Department announces summer schedule   Half day Schools in Telangana 2025  Telangana schools single-day classes due to heatwave

ఈ ఎండ‌ల వ‌ల్ల‌ విద్యార్థుల‌కు ఎలాంటి అసౌకర్యం లేకుండా... అయా స్కూల్స్ త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలి విద్యాశాఖ అధికారులు ఆదేశాల‌ను జారీ చేశారు.

అలాగే ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుంద‌ని.. అలాగే వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

☛➤ AP Inter Colleges Summer Holidays 2025 : ఏపీలో ఇంట‌ర్ కాలేజీల‌కు వేస‌వి సెల‌వులు.. ? మొత్తం ఎన్ని రోజులంటే...?

తెలంగాణ పాఠశాలల కొత్త టైమింగ్ ఇవే.. (మార్చి 15 - ఏప్రిల్ 23, 2025) : 
➤☛ సాధారణ తరగతులు : ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
➤☛ 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో.. : మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు
➤☛మధ్యాహ్న భోజనం : 12:30 గంటలకు అందుబాటులో ఉంటుంది

ఈ మార్పులు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు అన్నింటికీ వర్తిస్తాయ‌ని విద్యాశాఖ అధికారాలు తెలిపారు.

 

మార్చి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 14 Mar 2025 10:47AM

Photo Stories