Skip to main content

Summer Holidays Announcement : ఎండ తీవ్రత పెరుగుద‌ల‌... స్కూళ్ల వేసవి సెలవులపై కీల‌క నిర్ణ‌యం... ముందుగానే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
Government announcement on early summer vacations

అలాగే విద్యార్థులు కూడా అతి క‌ష్టం మీద ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఎండలు అప్పుడే రికార్డు స్థాయిలో నమోదు అవ‌డంతో... పరీక్షలు పూర్తికాగానే... వెంట‌నే ఈ సారి వేసవి సెలవులు ప్రకటించాలని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా... మార్చి 15వ తేదీ నుంచే ఒంటి పూట బడులు ఇవ్వ‌నున్నారు.

ఈ సారి ఎక్కువ రోజులు సెల‌వులే..
ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా ఈ సారి వేస‌వి సెల‌వులు ఎక్కువ రోజులు ఇచ్చే అవ‌కాశం ఉంది. విద్యార్ధులకు 45 నుంచి 55 రోజులు పాటు రోజుల పాటు వేసవి సెలవులు రానున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 

వేస‌వి సెల‌వులు ఎప్పుటి నుంచి అంటే...
ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెలవులు ప్రకటించి తిరిగి జూన్‌ 12 నుంచి తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

స్కూల్స్‌ నిర్వహణ,  పరీక్షలపైన రెండు రాష్ట్రాల‌ విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. విద్యార్ధులు ఈ ఎండ‌ల వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా... ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

మార్చి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 10 Mar 2025 03:01PM

Photo Stories