Red Bus Founder Success Story : నాడు 5 లక్షలతో ప్రారంభం.. నేడు 6000 కోట్లతో.. రెడ్ బస్ యాప్ ఫౌండర్ సక్సెస్ స్టోరీ ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్: రెడ్ బస్ ఫౌండర్ ఫణీంద్ర సమ.. జీవితంలో చూసి ఒకే ఒక సంఘటన కారణాంగా తానే సొంత వ్యాపారం ప్రారంభం చేయాలనే లక్ష్యన్ని ఏర్పర్చుకున్నారు. అసలెవరీ ఫణీంద్ర.. ఇతని జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటి? ఇతని కథే ఇప్పుడు చాలామందికి ఒక స్పూర్తి, ఇతని గెలుపు ప్రయాణం అందరికీ ఒక పాఠం..
స్వస్థలం.. చదువు..
1980లో తెలంగాణలోని నిజామాబాద్‌లో ఉన్న తడపైకల్ అనే ఒక చిన్న గ్రమంలో పుట్టాడు ఫణీంద్ర సమ. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు.
అప్పటినుంచి తన తల్లితోనే పెరిగాడు.చదువులో విషయంలో ఎప్పుడూ ముందే ఉండేవాడు. తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తరువాత ఫణీంద్రకు బిర్లా ఇన్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఈఈఈ విభాగంలో ఉత్తీర్ణత సాధించి, ఇంజినీర్ అయ్యాడు.
అనంతరం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో ప్రావీణ్యం సాధించాడు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్, అండ్ ఎకనామిక్స్ అండ్ సైకాలజీలో రీజనబుల్ లీడర్‌షిప్ అండ్ సస్టైనెబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ పూర్తి చేశాడు. ఇలా, తను కొన్ని కోర్సుల్లో ప్రావీణ్యం సాధించాడు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
మిత్రులతో..
వివిధ కోర్సుల్లో తన చదువును పూర్తి చేసుకున్న ఫణీంద్ర తన ఇంజినీరంగ్ స్నేహితులు సుధాకర్ పసుపునూరి, చరణ్ పద్మరాజు, వీరు ముగ్గురు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి, ముందుకు సాగారు కాని, ఆ ముగ్గురి ఆశయం మాత్రం ఒక్కటే ఉండేది.
ముగ్గురు కలిసి ఏదైన సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. కాని, అందుకు కావాల్సిన పెట్టుబడి వారి వద్ద లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు.
ఒకే ఒక్క సంఘటనతో..
2005లో తన ఊరికి వెళ్లేందుకు ప్రయాణానికి సిద్ధమైన ఫణీంద్రకు బస్సు టికెట్ తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఒకే ఒక్క టికెట్ కొనేందుకు ఎంతో సమయం కేటాయించాల్సి వచ్చింది. ఈ ఒక్క సంఘటన తన ఆశయాన్ని నిర్ణయించింది. ఇకపై తనలా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా తానే స్వయంగా ఈ రెడ్ బస్ ఆలోచనను సమకూర్చి, నేడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
5 లక్షల నుంచి 6000 కోట్లకు ప్రయాణం..
తన జీవితంలో ఒక లక్ష్యమైతే సిద్ధంగా ఉంది. కాని, ఎలా అమలు చేయాలో తెలీదు, పెట్టుబడికి 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. స్నేహితుల తోడు తప్పితే ఎంకెవ్వరి తోడులేదు. అయినప్పటికి ఫణీంద్ర ఆలోచనలతో ఆగలేదు. ఎలాగైనా సరే చేయాలనే ఆశ పెరుగుతూ ఉండేది. ఈ వ్యాపారం ప్రారంభించే సమయంలో ఎక్కువ పెట్టుబడి లేదు, చిన్న వ్యాపారం ఎలా పెద్దది చేయ్యాలో తెలీదు. 2006 సంవత్సరంలో రెడ్ బస్ అనే యాప్‌ని సృష్టించి దేశవ్యప్తంగా అందరికీ ఉపయోగపడేలా తయారు చేశాడు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా టిక్కెట్లు పొందడం సులభతరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాని, ఈ యాప్‌ను ప్రారంభించాలని నిర్ణయించిన సమయంలో ఏమాత్రం ఎంత ఎత్తుకు ఎదుగుతుందని ఊహించలేదు ఫణీంద్ర.
అయినప్పటికీ, 5 లక్షలే ఉన్నాయని, సాధ్యమవుతుందో లేదో తెలియకుండానే నేడు అదే పెట్టుబడితో ప్రారంభించిన యాప్ ఎంత విజయవంతంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నాడు ముగ్గురు స్నేహితులు కలిసి ప్రారంభించారు.. నేడు, రెడ్ బస్సు యాప్ విలువ సుమారుగా ₹6,985 కోట్లుకు లాభాలతో నడుస్తోంది. గెలుపును తాకాలంటే.. సంకల్పం, కృషి, పట్టుదల ఉండాలని స్పష్టంగా తెలియజేశాడు ఈ యాప్ ఫౌండర్ ఫణీంద్ర సమ అతని మిత్రలు సుధాకర్, చరణ్.
Tags
- success story of redbus founder
- redbus founder phanindra sama
- inspiring and successful stories
- redbus net worth
- position of redbus business
- success story of three friends in redbus
- redbus app
- success stories for youngsters
- redbus app founder phanindra sama success story
- latest inspiring story
- inspiring and success story of business man
- motivational stories in telugu
- Red Bus Founder Phanindra Sama Success Story
- Red Bus Founder Phanindra Sama Success Story in telugu
- Education News
- Sakshi Education News