Skip to main content

2025 Public Holidays: 2025 సంవత్సరం సెలవులు జాబితా విడుదల.. మొత్తం ఎన్నంటే..?

సాక్షి, అమరావతి: 2025 క్యాలెండర్‌ సంవత్సరానికి సంబంధించి సాధారణ సెలవులు, ఆప్షనల్‌ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబ‌ర్ 7న‌ విడుదల చేసింది. దీనిప్రకారం 2025కు సంబంధించి మొత్తం 23 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు రిపబ్లిక్‌ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండుగలు ఆదివారంలో కలిసిపోవడంతో నికరంగా 19 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి.
General Holidays for the year 2025  Andhra Pradesh 2025 holiday list announcement  Holiday schedule for government employees in Andhra Pradesh, 2025  List of regular and optional holidays for 2025 in Andhra Pradesh

అదే విధంగా అక్టోబర్‌ 2 గాందీజయంతి, విజయదశమి రెండూ కలిసిపోయాయి. పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునే విధంగా 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్‌–ఈ– గదర్, మహలాయ అమావాస్యలు ఆదివారంతో కలిసిపోయాయి. మొత్తం 12 నెలల్లో 10 నెలల్లో సెలవులు ఉండగా మే, నవంబర్‌ నెలల్లో ఎటువంటి సెలవులు లేవు. 

జనవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో అత్యధికంగా నాలుగేసి రోజులు సెలవులు వచ్చాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ద్వారా 20 సాధారణ సెలవులను ప్రకటించింది. నెలవంక దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీతో పాటు ఇతర హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రచార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఏపీలో సాధారణ సెలవులు - 2025

  • భోగి : 13-01-2025(సోమవారం)
  • సంక్రాంతి : 14-01-2025(మంగళవారం)
  • కనుమ - 15-01- 2025(బుధవారం)
  • రిపబ్లిక్ డే : 26-01-2025(ఆదివారం)
  • మహా శివరాత్రి : 26-02-2025(బుధవారం)
  • హోలీ : 14-03-2025(శుక్రవారం)
  • ఉగాది : 30-03-2025(ఆదివారం)
  • ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్) : 31-03-2025(సోమవారం)
  • బాబు జగ్జీవన్ రామ్ జయంతి : 05-04-2025(శనివారం)
  • శ్రీరామ నవమి : 06-04-2025(ఆదివారం)
  • బి.ఆర్. అంబేద్కర్ జయంతి -14-04-2025(సోమవారం)
  • గుడ్ ఫ్రైడే : 18-04-2025(శుక్రవారం)
  • ఈదుల్ అజా (బక్రీద్) : 07-06-2025(శనివారం)
  • మొహరం : 06-07-2025(ఆదివారం)
  • వరలక్ష్మీవ్రతం - 08- 08- 2025(శుక్రవారం)
  • స్వాతంత్ర్య దినోత్సవం : 15-08-2025(శుక్రవారం)
  • శ్రీ కృష్ణాష్టమి : 16-08-2025(శనివారం)
  • వినాయక చవితి : 27-08-2025(బుధవారం)
  • ఈద్ మిలాదున్ నబీ : 05-09-2025(శుక్రవారం)
  • దుర్గాష్టమి - సెప్టెంబర్ 30, 2025(మంగళవారం)
  • మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి : 02-10-2025(గురువారం)
  • దీపావళి : 20-10-2025(సోమవారం)
  • క్రిస్మస్ : 25-12-2025(గురువారం)

ఏపీలో ఐచ్ఛిక సెలవులు-2025

  • న్యూ ఇయర్ - జనవరి 1, 2025(బుధవారం)
  • హజ్రత్ అలీ పుట్టినరోజు : 13-01-2025(సోమవారం)
  • షాబ్-ఇ-మెరాజ్ : 27-01-2025(సోమవారం)
  • షబే ఎ బరాత్ - 14- 02- 2024(శుక్రవారం)
  • షాహదత్ HZT అలీ : 22-03-2025(గురువారం)
  • జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్ : 28-03-2025(శుక్రవారం)
  • మహావీర్ జయంతి : 10.04.2025(గురువారం)
  • బసవ జయంతి : 30-04-2025(బుధవారం)
  • బుద్ధ పూర్ణిమ : 12-05-2025(సోమవారం)
  • ఈద్-ఎ-గదీర్ : 15-06-2025 (ఆదివారం)
  • రథ యాత్ర : 27-06-2025(శుక్రవారం)
  • 9వ మొహర్రం : 05-07-2025(శనివారం)
  • శ్రావణ పూర్ణిమ : 15-08-2025(శుక్రవారం)
  • పార్సీ నూతన సంవత్సర దినోత్సవం : 15.08.2025(శుక్రవారం)
  • మహాలయ అమవాస్య - సెప్టెంబర్ 21, 2025(ఆదివారం)
  • యాజ్ దహుమ్ షరీఫ్ : 09-10-2025(గురువారం)
  • కార్తీక పూర్ణమ - 11 నవంబర్ 2025
  • గురునానక్ జయంతి - 11 నవంబర్ 2025
  • కిస్మస్ ఈవ్ -24 డిసెంబర్ 2025(బుధవారం)
  • బాక్సింగ్ డే - 26 డిసెంబర్ 2025(శుక్రవారం)
  • నరక చతుర్ధి : 19-10-2025(ఆదివారం)
Published date : 09 Dec 2024 10:00AM

Photo Stories