TGCHE: ఉన్నత విద్యలో సమూల మార్పులు.. విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ ఇలా..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామని, ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను డిగ్రీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
మండలి రూపొందించిన డైరీ, కేలండర్‌ను జనవరి 6న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
సబ్జెక్టుకు చెందిన ముఖ్యాంశాలు గ్రహించేలా, పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఈ స్టడీ మెటీరియల్ తోడ్పడుతుందని తెలిపారు. లోతైన అధ్యయనం చేసేవారి కోసం రెఫరెన్స్ పుస్తకాల వివరాలను సైతం ఈ స్టడీ మెటీరియల్‌లో పొందుపరుస్తామన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
పోటీపరీక్షల అభ్యర్థులు రూపొందించుకునే స్టడీ మెటీరియల్‌లా ఇది ఉంటుందన్నారు. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను 30 శాతం చొప్పున మార్చాలని ఇప్పటికే మండలి నిర్ణయించిందని పేర్కొన్నారు. కాగా, పరిశోధనను ప్రోత్సహించేలా ఈ సిలబస్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు.
Published date : 07 Jan 2025 12:59PM