Skip to main content

Property Tax: ప్రభుత్వ పాఠశాలకు రూ. కోటి 77 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్

వనస్థలిపురం: హయత్ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు - రూ. 1,77,71,195 ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటూ జీహెచ్ఎంసీ హయత్ నగర్ సర్కిల్ అధికారులు నోటీసులు పంపించారు.
Government school property tax

ఈ విషయమై పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. జ‌న‌వ‌రి 6న‌ జీహెచ్ఎంసీ సిబ్బంది పాఠశాల ప్రధానోపాధ్యా యురాలికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు అందజేశారు. అందులో 2024 ఏప్రిల్ నాటికి పాత బకాయిలు రూ. 53,51,946, దానికి వడ్డీ రూ.1,21,19,669, ప్రస్తుతం 2024-25 కి గానూ రూ.2,77,388, ప్రస్తుత వడ్డీ రూ.22,192 కలిపి - రూ.1,77,71,195 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.

ఈ విషయమై ప్రధానోపా ధ్యాయురాలు ఇందిర మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు ఇలాంటి నోటీసులు ఇవ్వడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ విషయంను డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

చదవండి: TGCHE: ఉన్నత విద్యలో సమూల మార్పులు.. విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ ఇలా..

గతంలో అసెస్మెంట్ చేసుకుంటేనే పంపుతాం- డీసీ యాదయ్య 

ప్రభుత్వ పాఠశాలకు రూ. 1,77,71,195 కట్టాలం టూ నోటీసులు ఇవ్వడంపై 'సాక్షి' హయత్ నగర్ స‌ర్కిల్ డీసీ తిప్పర్తి యాదయ్యను వివరణ కోరగా.... గతంలో అసెస్మెంట్ చేసుకుంటే ప్రభుత్వ పాఠశా లలకు కూడా ట్యాక్స్ విధింపు ఉంటుందని అన్నారు. రికార్డులు పరిశీలించిన తర్వాత దీనిపై సమాధానం చెబుతామని ఆయన పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 Jan 2025 01:37PM

Photo Stories