Skip to main content

State-level Science exhibition: రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన.. ప్రయోగాలు జాతీయ స్థాయికి ఎంపిక!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వేదికగా రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లోని ఎస్‌వీకేఎం పాఠశాలలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 2023–24 ఇన్‌స్పైర్‌ అవార్డులు, రాష్ట్రస్థాయి బాల్‌ వైజ్ఞానిక ప్రదర్శన 2024–25 రెండింటినీ సంయుక్తంగా ఒకే వేదికపై నిర్వహించనున్నారు.
Inspire Awards and State-level Childrens Science Exhibition 2024-25  State level educational and scientific exhibition from today  State-level educational and scientific exhibition in Mahbubnagar

ఈ ప్రదర్శనకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 2,200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, గైడ్‌లు హాజరుకానున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే బాలబాలికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు ఏర్పా టు చేశారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనుంది. తొలి రోజు కార్యక్రమాన్ని జ‌న‌వ‌రి 7న‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

చదవండి: Good news for Inter students: Inter విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ సిలబస్‌ తగ్గించాలని నిర్ణయం

రెండో రోజు మిల్లెట్స్‌పై, రోడ్డు భద్రత వారోత్సవాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. మూడో రోజు ఫలితాల ప్రకటన, విజేతలకు బహుమతుల ప్రదానం జరగనుంది. వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి సుస్థిర భవిష్యత్‌ కోసం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భాగంగా మరో ఏడు అంశాలకు సంబంధించి విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. ఇందులో ఉత్తమంగా ఉన్న 99 ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.  

Published date : 07 Jan 2025 12:58PM

Photo Stories