Skip to main content

Free 10th Study Material: ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ధరూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సీనియర్‌ సవిల్‌జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవి అన్నారు.
Best results should be achieved in Class 10

జ‌న‌వ‌రి 6న‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, వార్షిక పరీక్షల్లో ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు రాబట్టాలన్నారు.

విద్యార్థులకు పదో తరగతి అనేది ఎంతో కీలకమైనదని.. ఎక్కడికి వెళ్లినా మొదట ఎస్‌ఎస్‌సీ మెమోనే చూస్తారని తెలిపారు. ఉత్తీర్ణత ఎవరైనా అవుతారని.. 10/10 సాధించడం గొప్ప అని అన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడం.. చదవడం.. రాయడం ఎవరు చేస్తారో వారే మంచి మార్కులు సాధిస్తారన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్నందున ప్రణాళికా బద్ధంగా చదువుకోవాలని సూచించారు. ధరూరు పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు మొత్తం 199 మంది ఉన్నారని.. వందశాతం ఫలితాలు సాధించాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

క్రమశిక్షణతో బాగా చవిది కన్న వారు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉన్నత స్థానంలో ఉండి ఒకరికి సహాయం చేసేలా ఉండాలన్నారు. 20 ఏళ్లు కష్టపడి చదివితే 80 ఏళ్లు సుఖంగా ఉండవచ్చని తెలిపారు. అనంతరం హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సహకారంతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రవీంద్ర బాబు, జీహెచ్‌ఎం ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Published date : 08 Jan 2025 10:05AM

Photo Stories