"‘శాస్త్రవేత్తతో ఒక రోజు’.. ఈ తరగతి విద్యార్థులకు అదిరే అనుభవం!
Sakshi Education
నిజామాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ ద్వారా ‘శాస్త్రవేత్తతో ఒక రోజు’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమీపంలోని రిసెర్చ్ ల్యాబ్, ప్లానిటోరియం, స్పేస్ సెంటర్, IIT వంటి సంస్థలను సందర్శించి అనుభవాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
- వర్చువల్ ఇంటర్వ్యూ: విద్యార్థులు సైంటిస్ట్‌ను ఒక రోజు వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేయాలి.
- ప్రత్యక్ష అనుభవం: రీసెర్చ్ ల్యాబ్, స్పేస్ సెంటర్ వంటి ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించి అవగాహన పొందాలి.
పోటీలు & పోస్ట్ మేకింగ్:
- క్విజ్ పోటీలు
- డిబేట్ & పోస్టర్ మేకింగ్
తరగతులు: 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది.
కార్యక్రమ నిర్వహణ & నివేదికలు:
- తేదీ: మే 5, 2025 లోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
- వివరాల పంపిణీ: స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ & శిక్షణ (SCERT) వారికి నివేదికలు పంపించాలి.
![]() ![]() |
![]() ![]() |
Published date : 26 Mar 2025 05:50PM