Good News for Students : విద్యార్థులకు శుభవార్త.. ఈనెలలో ఏకంగా 9 సెలవులు.. కానీ!!
సాక్షి ఎడ్యుకేషన్: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు జనవరి నెలలో ఈ సారి ఒకటి రెండు కాదు, ఏకాంగా 9 రోజులు సెలవులు ఉన్నాయి. వరుసగా కాకపోయినా, నెలలో 9 సెలవులు అంటే విద్యార్థులకు ఇది సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. ప్రతీ నెలలో వచ్చే సాధారణ సెలవులకే విద్యార్థుల ఆనందానికి అవుధులుండవు. అటువంటిది పండుగలు, ప్రభుత్వ సెలవులు అన్ని కలిపి వస్తే ఇక వారికి పెద్ద పండగే..
సెలవుల వివరాలు..
జనవరి నెలలో మొదటగా వచ్చే సెలవు జనవరి 1వ తేదీ.. నూతన సంవత్సర దినోత్సవం. ఈ రోజు ప్రతీ విద్యాసంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. జనవరి 13వ తేదీన భోగి, జనవరి 14వ తేదీన సంక్రాంతి/పొంగల్ వంటి పెద్ద పండుగలకు సెలవు ఉంటుంది. అయితే, గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీన కాగా, ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. కాని, ఈ సారి ఆదివారం నాడే గణతంత్ర దినోత్సవం అయినప్పటికీ విద్యార్థులకు ఒక సెలవు తప్పింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఆప్షనల్ సెలవులు..
ఆదివారాలు, సాధారణ సెలవులు కాకుండా, జనవరిలో మూడు ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. జనవరి 14వ తేదీన హజ్రత్ అలీ పుట్టినరోజు, జనవరి 15వ తేదీన కనుము, జనవరి 25వ తేదీన షబ్-ఎ-మెరాజ్ వంటి రోజుల్లో ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది. హజ్రత్ అలీ పుట్టినరోజు ఆప్షనల్ హాలిడే లిస్ట్‌లో చేర్చినప్పటికీ.. అదే రోజున సంక్రాంతి/పొంగల్ కావడంతో జనవరి 14 సాధారణ సెలవుదినం కిందకు వస్తుంది. తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఆప్షనల్ సెలవుల్లో మూసి ఉండవు. కాని, షబ్-ఎ-మెరాజ్ రోజున మాత్రం చాలా మైనారిటీ పాఠశాలలకు సెలవు ఉంటుంది.
Good news for Inter students: Inter విద్యార్థులకు గుడ్‌న్యూస్ సిలబస్ తగ్గించాలని నిర్ణయం
సంక్రాంతి సెలవులు..
ఇది ప్రభుత్వం విడుదల చేసిన ఏడాది క్యాలెండర్ ప్రకారం సెలవుల జాబితా. అయితే 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని విద్యా శాఖ పేర్కొంది.
Tags
- schools and colleges holidays
- january month holidays 2025
- Holidays 2025
- sankranti holidays 2025
- telangana education institutions holidays
- telangana state schools and colleges holidays 2025
- Holidays for schools
- government holidays 2025
- 2025 calender
- telangana holidays calender 2025
- sankranti 2025 holidays
- Republic Day
- sunday holidays
- january 2025 holidays list
- minority schools holidays
- Hazrat Ali birth anniversary
- Shab-e-Meraj
- bhogi and kanuma holidays 2025
- bhogi and kanuma holidays 2025 for schools and colleges
- january 14th
- 6 days sankranti holidays 2025
- new year holiday
- news year 2025 holidays list
- Education News
- Sakshi Education News