ఎంవీపీకాలనీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 2025 విద్యా సంవత్సరం జనవరి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ గోనిపాటి ధర్మారావు తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
IGNOU Admissions 2025
కేంద్రం పరిధిలోని 11 జిల్లాల విద్యార్థులు https://ignouadmission.samarth.edu. in/ ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. దరఖాస్తుకు ఈ నెల 31 చివరి తేదీ అని, పూర్తి వివరాలకు ఎంవీపీకాలనీ ఉషోదయ కూడలిలోని ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.