Skip to main content

Gurukul School Admissions : గురుకుల పాఠ‌శాల‌లో 5వ త‌ర‌గ‌తి ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ప‌రీక్ష ఎప్పుడంటే..!

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలో ఐద‌వ త‌ర‌గ‌తిలో ఖాళీగా ఉన్న సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు యాజ‌మాన్యం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
Fifth class admissions at gurukul schools 2025  announcement for 5th class admission in Telangana Social Welfare Gurukul Schools  Notification for vacant seats in the 5th class at Telangana Social Welfare Gurukul School  Details of the admission application for the 5th class in Telangana Social Welfare Gurukul SchoolsApplication details for 5th class admission in Telangana Social Welfare Gurukul Schools

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలో ఐద‌వ త‌ర‌గ‌తిలో ఖాళీగా ఉన్న సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు యాజ‌మాన్యం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 5వ త‌ర‌గ‌తిలో చేరేందుకు నోటిఫికేష‌న్ చేసి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు సాంఘిక సంక్షేమ గురుకులాల జోనల్ అధికరి కే నిర్మల, ప్రిన్సిపాల్ బి.వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అడ్మిష‌న్ పొందేందుకు ద‌ర‌ఖాస్తులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు..

B Ed Admissions Counselling : డా.బీఆర్ అంబేడ్క‌ర్ వ‌ర్సిటీలో బీఈడీ కోర్సులు.. ఈ తేదీల్లోనే కౌన్సెలింగ్‌..

గురుకులంలో ప్ర‌వేశాల‌కు అర్హులైన‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ విద్యార్థులకు నిర్వహించే అర్హత పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాను యూనిట్గా చేసుకుని ప్రవేశాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1 వరకు ద‌ర‌ఖాస్తులు పూర్తి చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 23వ తేదీన‌ ప్రవేశ పరీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. దరఖాస్తుల‌కు అధికారిక వెబ్ సైట్ https://tgswreis.telanagana , https://tgcet.cgg.gov.in లో చేసుకోవాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jan 2025 01:31PM

Photo Stories