Skip to main content

B Ed Admissions Counselling : డా.బీఆర్ అంబేడ్క‌ర్ వ‌ర్సిటీలో బీఈడీ కోర్సులు.. ఈ తేదీల్లోనే కౌన్సెలింగ్‌..

బోధన అందించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందుకు ప‌లు కోర్సుల పూర్తి చేయ‌డం, ప‌రీక్ష‌లు రాయ‌డం వంటివి ఉంటాయి.
Eligible students apply for B.Ed vacancies at Dr. BR Ambedkar Open University   Dr. BR Ambedkar Open University B.Ed admission process and vacancies  Counselling for b ed courses admissions at dr br ambedkar open university

సాక్షి ఎడ్యుకేష‌న్: బోధన అందించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందుకు ప‌లు కోర్సుల పూర్తి చేయ‌డం, ప‌రీక్ష‌లు రాయ‌డం వంటివి ఉంటాయి. అయితే, హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ఖాళీలు ఉన్నాయి. అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన విద్యార్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకుని, ప్రవేశాలకు పొందేందుకు అక్క‌డి యాజ‌మాన్యం అడ్మిష‌న్ నోటిఫికేషన్‌ను జారీ చేసింద‌న్న సంగతి తెలిసిందే.

Engineering PG Courses: ఓయూ ఇంజినీరింగ్ పీజీ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు

అయితే, 2024-25 విద్యాసంవ‌త్సరానికి సంబంధించి ఈ ప్రవేశాలను కల్పించేందుకు, డిసెంబర్ 31, 2024వ తేదీన అంటే, మంగ‌ళ‌వారం నాడు ఎంట్రెన్స్ పరీక్ష కూడా జరిగింది. అయితే ఎంట్రెన్స్ ఫలితాలు, కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు.

తొలి వారంలోనే..

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు జనవరి మొదటి వారంలో విడుదల కానున్నాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://www.braouonline.in/Home.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… ర్యాంక్ కార్డులను పొందవచ్చు.

CBSE Recruitment 2025 Notification: ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌చేయండి

కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌..

మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తారు. అనంత‌రం, జనవరి మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కౌన్సెలింగ్ తేదీలతో పాటు మిగతా వివరాలను చూడొచ్చు.

AP Inter 2nd Year 2025 Time Table: ఇంటర్‌ 2nd ఇయర్‌ పరీక్షల టైం-టేబుల్‌ విడుదల..సబ్జెక్టుల వారీగా మెటీరియల్స్‌ ఇవే

ఫలితాల ప‌రిశీలన‌..!

1. మొద‌ట https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. బీఆర్ఏఓయూ బీఆడీ ఎంట్రెన్స్ టెస్ట్ 2024 రిజ‌ల్ట్స్.. ఈ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
4. మీ ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. ఇక‌, మీ ఫ‌లితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jan 2025 10:43AM

Photo Stories