Skip to main content

15 Days School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలలకు 15రోజులు శీతాకాల సెలవులు

విద్యార్థులకు సెలవులంటేనే ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తే? చలి తీవ్రత పెరగుతుండటంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు భారీగా సెలువులు ప్రకటించాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో  పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు.
15 Days School Holidays   Announcement of 15-day holiday for schools in Delhi and Haryan  Government and private offices closed from January 1 to 15 School and government holiday announcement for Delhi and Haryana states
15 Days School Holidays Winter School holidays winter school holidays announcement in north india

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారం నుంచి 15 రోజుల వరకు సెలవులు ‍ప్రకటించాయి. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో దాదాపు 15 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌, అంగన్‌వాడీ కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగతా రాష్ట్రాల్లో సెలవుల విషయానికి వస్తే..


శీతాకాల సెలవులు:

ఢిల్లీ:
2024-25 విద్యా సంవత్సరానికి జనవరి 1 నుండి జనవరి 15 వరకు శీతాకాల సెలవులు.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలపై ఈ నిబంధన వర్తిస్తుంది.

మధ్యప్రదేశ్‌:
డిసెంబర్‌ 31 నుంచి జనవరి 4, 2025 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. జనవరి 5న ఆదివారం కూడా సెలవు. దీంతో జనవరి 6 నుంచి స్కూళ్లు పునః ప్రారంభిస్తారు.

Schools Across India Announce Winter Holidays: Check Vacation Dates | Sakshi  Education

జమ్ము కశ్మీర్:
5వ తరగతివరకు డిసెంబర్ 10, 2024 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు సెలవులు ప్రకటించారు
6 -12 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 16, 2024 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు సెలవులు ప్రకటించారు.

Intermediate Exams Fee: ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు రేపే చివరితేది

ఉత్తర ప్రదేశ్ (యూపీ):
డిసెంబర్ 31 నుండి 2025 జనవరి 15 వరకు శీతాకాల సెలవులు.

పంజాబ్:
2024 డిసెంబర్ 24 నుండి 2024 డిసెంబర్ 31 వరకు పాఠశాలలు మూసివేస్తారు.
అవసరమైతే వాతావరణ పరిస్థితుల ఆధారంగా సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

హర్యానా:
హర్యానాలో జనవరి 1 నుంచి జనవరి 15 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

School Holidays: విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు.. ఎందుకంటే? |  Sakshi Education

రాజస్థాన్:
2024 డిసెంబర్ 25 నుండి 2025 జనవరి 5 వరకు శీతాకాలపు సెలవులు ఉంటాయి.

 

బీహార్:
2024 డిసెంబర్ 25 నుండి 2024 డిసెంబర్ 31 వరకు పాఠశాలలు మూసివేస్తారు.

జార్ఖండ్:
జనవరి 5, 2025 వరకు సెలవులు ప్రకటించారు. తిరిగి జనవరి 6న స్కూళ్లు తెరుస్తారు. 

ఉత్తరాఖండ్‌:
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జనవరి 4, 2025 వరకు సెలవు

Holidays List 2025 : వ‌చ్చే ఏడాది 2025లో 50 రోజులకు పైగా సెల‌వులు... ఎలా అంటే..? ఈ టెక్నిక్ పాటిస్తే...!

ఆ రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు | UP Schools Closed: 15-Day Winter Holidays  | Sakshi

స్కూల్ సమయాల్లో మార్పులు:

ఛత్తీస్‌గఢ్:

మొదటి షిఫ్ట్: ఉదయం 9:00 నుండి 12:30 వరకు.
రెండవ షిఫ్ట్: 12:45 నుండి 4:15 వరకు.

సింగిల్ షిఫ్ట్ స్కూల్స్:

ఉదయం 10:30 నుండి 3:30 PM వరకు.

AP DSC 2025 SGT Mathematics Syllabus in Telugu: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. SGT మ్యాథమేటిక్స్‌ సిలబస్‌

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 31 Dec 2024 09:50AM

Photo Stories