Three Days School Holidays: నేటి నుంచి మూడురోజుల పాటు స్కూళ్లకు సెలవులు..
Sakshi Education
ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. అటు తెలంగాణలో వరుసగా మూడు రోజుల పాటు సెలువులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Three Days School Holidays
డిసెంబర్ 24 నుంచి 26 వరకు అన్ని జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులను ఇవ్వాలని నిర్ణయించింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కిరించుకొని వరుసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు వస్తున్నాయి.
డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ ఈవ్, 25వ తేదీ క్రిస్మన్ పర్వదినం, 26వ తేదీ బాక్సింగ్ డే సందర్భంగా వరుసగా సెలవులు వచ్చాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి.ఏపీలో రేపు పబ్లిక్ హాలిడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.