Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. 21 మంది ఎంపిక
Sakshi Education
సత్యవేడు: స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 21 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్టు సత్యవేడు స్కీల్ హబ్ కో–ఆర్డినేటర్ చైతన్యచక్రవర్తి తెలిపారు.
Job Mela
32 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా.. 21 మంది ఎంపికై నట్టు ఆయన వెల్లడించారు. శ్రీసిటీలో బ్లూఓషన్, డైకిన్ కంపెనీల్లో వారు ఉద్యోగాలు సాధించినట్టు పేర్కొన్నారు. కంపెనీ ప్రతినిధులు గోపి, చంద్రబాబు పాల్గొన్నారు.