Skip to main content

Job Mela: ఈనెల 8న జాబ్‌మేళా..నెలకు రూ. 20 వేల వరకు వేతనం

Collector Dinesh Kumar promoting employment opportunities for youth Job Mela  AP Skill Development Corporation organaized job fair  employment opportunities for unemployed youth
Job Mela

పాడేరు : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 8న చింతపల్లి వైటీసీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు.ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం జాబ్‌మేళా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

Spot Admissions: ఈనెల 7 నుంచి డిగ్రీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

ఈ సందర్భంగా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాలో అపోలో ఫార్మసీ, నవత రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌, కేర్‌ ఫర్‌ యూ తదితర కార్పొరేట్‌ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. జాబ్‌మేళాకు 18 ఏళ్లు నిండి 30 ఏళ్ల లోపు ఉన్న ఇంటర్‌, డిప్లామో, డిగ్రీ, బీటెక్‌, ఆపై విద్యర్హత కలిగిన యువత అర్హులుగా తెలిపారు. కంపెనీ, పోస్టుకు సంబంధించి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వేతనాలు ఇస్తారని చెప్పారు.

KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

మరిన్ని వివరాలకు 8985832827, 9398338105 నంబర్లకు లేదా httpr://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. జేసీ అభిషేక్‌ గౌడ్‌, ఐటీడీఏ పీవో అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

పాల్గొనే కంపెనీలు: అపోలో ఫార్మసీ,నవత రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌,కేర్‌ ఫర్‌ యూ తదితర కంపెనీలు
వయస్సు: 18-30 ఏళ్ల లోపు అర్హులు

అర్హత: ఇంటర్‌, డిప్లామో, డిగ్రీ, బీటెక్‌
వేతనం: నెలకు రూ. 10,000- రూ. 20,000/-

మరిన్ని వివరాలకు 8985832827, 9398338105 సంప్రదించండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 05 Oct 2024 03:06PM

Photo Stories