Skip to main content

Free Training: నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ

నిర్మల్‌ చైన్‌ గేట్‌: జిల్లాలోని నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు.
Vocational skill training for unemployed youth  District officials discussing self-employment training programs

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిరుద్యోగ యువతకు శిక్షణపై జిల్లాస్థాయి వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులతో అక్టోబర్ 4న‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందేలా వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు.

చదవండి: Unemployed Youth: నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి

ఆసక్తి కలిగిన యువతను గుర్తించి వివిధ కోర్సుల్లో శిక్షణ పొందేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇతర వృత్తి నైపుణ్య కేంద్రాల ద్వారా ఎలక్ట్రీషియన్‌, డీజిల్‌ మెకానిక్‌, సోలార్‌, ఏసీ టెక్నీషియన్‌, మార్కెటింగ్‌, బ్యుటీషియన్‌ తదితర కోర్సుల్లో శిక్షణ అందించాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

జాబ్‌ మేళాలు నిర్వహించి స్వయం ఉపాధి పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ వృత్తి నైపుణ్య కేంద్రాల ద్వారా శిక్షణను తీసుకున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, సీపీవో జీవరత్నం, డీ ఆర్డీవో విజయలక్ష్మి, ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి పరుశురాం, డీటీడీవో అంబాజీ, ఉపాధి కల్పన అధికారి శంకర్‌, మెప్మా పీడీ సుభాష్‌, వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Published date : 05 Oct 2024 01:38PM

Photo Stories