Model Schools Admissions : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

దరఖాస్తు ఇలా..
2025–26 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 24వ తేదీ నుంచి నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు పేమెంట్స్‌కు అవకాశం కల్పించారు. అలాగే దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించారు. ఆన్‌లైన్ పేమెంట్స్‌కు మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది. గతేడాది మాదిరిగానే 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్‌లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్టు ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్‌లిస్టు, అదేరోజు ఎంపిక జాబితాను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ముఖ్యమైన సమాచారం:
మోడల్ స్కూళ్లలో అడ్మీషన్స్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 31
పరీక్ష తేది: ఏప్రిల్ 20న
మెరిట్ లిస్ట్ విడుదల: ఏప్రిల్ 27న
సర్టిఫికేట్ వెరిఫికేషన్: ఏప్రిల్ 30న
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Admissions 2025
- model schools admissions
- applications for model schools
- 6th to 10th class admissions at model schools
- model schools admissions 2025
- important dates for model schools admissions
- Sakshi Education News
- AP Model Schools
- Admissions in AP Model Schools
- AP Model Schools admission
- latest sakshi education news
- AdmissionApplications
- MidDayMeals
- ModelSchoolAdmissions
- TelanganaSchools