245% Tariff On China: చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు.. 245 శాతానికి పెంపు!

చైనా బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించిన మరుసటి రోజే, అమెరికా ప్రభుత్వం ప్రతీకార చర్యగా చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచింది. ఏప్రిల్ 15న విడుదల చేసిన వైట్‌హౌస్ ఫ్యాక్ట్షీట్ ద్వారా ఈ సమాచారం బయటపడింది.
అరుదైన ఖనిజాలపై భద్రతా ఆందోళనలు
చైనాపై అధికంగా ఆధారపడే అరుదైన ఖనిజాల ఉత్పత్తి వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని భావించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ అంశంపై విచారణకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, దేశ ఆర్థిక స్థిరతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆయన ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ’కి ఆరంభం పలికారు.
75 దేశాలతో వాణిజ్య చర్చలు, కానీ చైనాపై కఠిన వైఖరి
ఈ నూతన వాణిజ్య విధానానికి ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా దేశాలు స్పందించాయి. వాటితో సుంకాలపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఆయా దేశాలపై తాత్కాలికంగా సుంకాలను వాయిదా వేయడంతో, అమెరికా సామరస్యత చూపినట్లు తెలుస్తోంది. అయితే చైనాపై మాత్రం ఈ సమర వైఖరి కొనసాగిస్తూ, ఎటువంటి సడలింపులూ ఇవ్వడం లేదు.
New Tariffs: చైనా స్మార్ట్ ఫోన్లపై సుంకాలు.. ఎలక్ట్రానిక్స్‌పై కూడా..
టారిఫ్‌ల తీవ్రత – చైనాకు భారీ నష్టం
చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 145 శాతం టారిఫ్‌లు అమలులో ఉన్నప్పటికీ, బోయింగ్ డెలివరీల నిషేధానికి ప్రతిగా అదనంగా 100 శాతం టారిఫ్ పెంచి మొత్తం 245 శాతానికి తీసుకెళ్లారు. ఈ విధానం చైనా తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అమెరికాలో చైనా ఉత్పత్తులను విక్రయించాలంటే ఇకపై భారీగా సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ట్రంప్ స్పందన – బంతి చైనా కోర్టులో ఉంది
ఈ పరిణామాలపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చైనా ఒప్పందం నుంచి వెనక్కి తగ్గడం సరైంది కాదని, వాణిజ్య యుద్ధంలో అమెరికా తన ప్రయోజనాలను కచ్చితంగా కాపాడుకుంటుందని అన్నారు. టారిఫ్ యుద్ధాన్ని ముగించాలంటే చైనా ముందుగా ముందడుగు వేయాల్సి ఉంటుందని, బంతి ప్రస్తుతం చైనా కోర్టులో ఉందని స్పష్టం చేశారు.
చైనా సంధానకర్తగా లీ చెంగాంగ్ నియామకం
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా సంధానానికి ముందుకొచ్చింది. వాణిజ్య చర్చల కోసం లీ చెంగాంగ్‌ను చర్చల ప్రతినిధిగా నియమించింది. ఆయన 2020లో అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో కూడా పాల్గొన్న అనుభవం ఉన్నవారు. అంతేకాదు 'ప్రపంచ వాణిజ్య సంస్థ'లో చైనా రాయబారిగా పని చేసిన చరిత్ర కూడా లీ చెంగాంగ్‌కు ఉంది. ఇది చైనా చర్చలకు సన్నద్ధంగా ఉందన్న సంకేతంగా భావించవచ్చు.
China Halts Export: అమెరికాపై చైనా కీలక నిర్ణయం.. ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతి నిలివేత
Tags
- Trump tariffs
- US China Tariff War
- Trump Economic Policy
- US China Semiconductor Trade
- US China Trade War
- China Retaliatory Tariffs
- Trump China Tariffs
- New Tariffs
- Tariff Tracker
- China US Trade War
- donald trump
- School Assembly News Headlines
- Sakshi Education News
- Latest News in Telugu
- WhiteHouseStatement
- USChinaRelations