TG Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం సర్వర్ డౌన్.. దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం.. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా!

అధికారిక వెబ్‌సైట్ తరచూ సర్వర్ డౌన్ అవ్వడంతో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయింది. మూడు వారాల వ్యవధిలో 12 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ, గత నాలుగు రోజులుగా వెబ్‌సైట్ సరిగా పనిచేయడం లేదు.
దరఖాస్తు సమయంలో వెబ్‌పేజీ ఫ్రీజ్ అవుతోంది, వివరాలు సమర్పించేలోపే పేజీ నిలిచిపోవడం వల్ల అభ్యర్థులు మళ్లీ ప్రారంభించాల్సి వస్తోంది. దీని వల్ల అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినట్టు చెబుతూ, మరోసారి పొడిగించడంపై స్పష్టత ఇవ్వలేదు.
వెబ్‌సైట్ సర్వర్ సమస్యలు – రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై ప్రభావం
ఈనెల 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండగా, అభ్యర్థులు సర్వర్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ‘Summer Camp’.. ఈ తరగతుల విద్యార్థులు మాత్రమే!
10వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:
దరఖాస్తు కేటగిరీ |
దరఖాస్తుల సంఖ్య |
రూ.50 వేల లోపు |
23,724 |
రూ.50 వేల నుంచి 1 లక్ష వరకు |
57,166 |
రూ.1 లక్ష నుంచి 2 లక్షల వరకు |
1,73,401 |
రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు |
8,73,230 |
సెలవులు కూడా ప్రభావం చూపించాయి
దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి ఉగాది, రంజాన్, అంబేడ్కర్ జయంతి వంటి పలు సెలవులు రావడంతో రెవెన్యూ అధికారుల సేవలలో జాప్యం జరిగింది. దీని ప్రభావంతో పథకానికి దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగిసేలోగా 20 లక్షలు చేరుతాయని అంచనా వేసినప్పటికీ, సాంకేతిక సమస్యల వల్ల ఆ లక్ష్యం సాధ్యం కానిది అయింది.
![]() ![]() |
![]() ![]() |