Skip to main content

UGC NET 2025 Notification : యూజీసీ నెట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ అర్హ‌త‌ల‌తోనే ద‌ర‌ఖాస్తుల‌కు అవ‌కాశం..

ఎన్‌టీఏ.. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ స్థాయిలో నిర్వ‌హించే అర్హ‌త ప‌రీక్ష యూజీసీ నెట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌లైంది.
NTA UGC NET 2025 notification released   Important dates for UGC NET 2025  UGC NET 2025 exam eligibility and application details NTA releases ugc net 2025 notification and its applications eligibility criteria

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఎన్‌టీఏ.. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ స్థాయిలో నిర్వ‌హించే అర్హ‌త ప‌రీక్ష యూజీసీ నెట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మెర‌కు అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తులను ప్రారంభించ‌వ‌చ్చని తెలిపారు. బుధ‌వారం, ఏప్రిల్ 16వ తేదీన విడుద‌లైన ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు నిన్న‌టి నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక‌, అభ్య‌ర్థులు ప‌రీక్ష, ముఖ్య తేదీలు, అర్హ‌త‌లు త‌దిత‌ర వివ‌రాల‌ను ప‌రిశీలించుకొని ద‌ర‌ఖాస్తుల‌ను వేగ‌వంతం చేయండి..

భారతీయ విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో 'అసిస్టెంట్ ప్రొఫెసర్స అండ్ 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్' వంటి పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.

TG ECET 2025 Last Date to Apply Online: తెలంగాణ ఈసెట్‌-2025కు అప్లై చేశారా? దరఖాస్తుకు ఇదే చివరి తేది!

అర్హ‌తలు..

సంబంధిత స‌బ్జెక్టులో 50 నుంచి 55 శాతం వ‌ర‌కు ఉత్తీర్ణ‌త త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. అంతేకాకుండా, యూజీసీ గుర్తింపు పొందిన వ‌ర్సిటీ లేదా క‌ళాశాల‌లో వారి డిగ్రీ, మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసుండాలి.
అభ్యర్థులు జనరల్/అన్‌రిజర్వ్డ్/జనరల్-EWS అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులతో లేదా ఇతర వర్గాలకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుకు అభ్యర్థులు 30 సంవత్సరాల వరకు ఉండాలి మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు వయోపరిమితి లేదు.

ముఖ్య తేదీలు ఇవే..

Starting Date of Applications 16th April, 2025
End of the Applications 07th May, 2025 (Upto 11:59PM)
Last date of Fees(Credit, Debit, Net Banking, UPI) 08th May, 2025 (Upto 11:59PM)
Application Correction Window 09th May, 2025 to 10th May, 2025
City of Exam Center Announcement To be Intimated later
Admit Card To be Intimated later
Exam Date 21st June, 2025 to 30th June, 2025
Center and Shift Details Mentioned in Admit Card
Website https://ugcnet.nta.ac.in / www.nta.ac.in
Application Fees Amount
General/Unreserved Rs.1,150
General-EWS/OBC-NCL Rs.600
SC/ST/PwD and Third Gender Rs.325

జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 బ్రేకింగ్ న్యూస్‌ :నేడు జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ర్యాంకులు విడుదల చేయనున్న ఎన్‌టీఏ

ఇలా ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..

👉 ముందుగా వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. https://ugcnet.nta.ac.in/

👉 'Click here to login/register' పై క్లిక్ చేయండి.

👉 అవ‌స‌ర‌మైన‌ వివ‌రాల‌తో లాగిన్ అవ్వండి.. ఒక‌వేళ రిజిస్ట్ర‌ర్ అవ్వ‌క‌పోతే, మొద‌లు రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసుకోండి.

👉 లాగిన్ అయ్యాక‌, అప్లికేష‌న్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది.

👉 వివ‌రాల‌ను న‌మోదు చేసి, ద‌ర‌ఖాస్తుల రుసుమును కూడా పూరించండి

👉 ఆపై స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి, అప్లికేష‌న్ ఫార్మ్ ప్రింట్ తీసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Apr 2025 12:35PM
PDF

Photo Stories