Polity Material and Bit Banks : భారత ప్రభుత్వ చట్టం–1919లోని ప్రధాన అంశం/అంశాలు?
భారత రాజ్యాంగం– చారిత్రక నేపథ్యం
సి.ఆర్. ఫార్ములా (1944) (సి. రాజగోపాలాచారి సూత్రం)
ముస్లిం లీగ్ సహకారం కోసం, మతసమస్యల పరిష్కారం కోసం 1944 మార్చిలో గాంధీజీ ఆమోదంతో కాంగ్రెస్ తరఫున సి.రాజగోపాలాచారి ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కోరికను ఆయన అంగీకరించారు. కాంగ్రెస్‌కు కావాల్సిన స్వతంత్ర సాధన, దాని కోసం ముస్లింల సహకారాన్ని పొందేందుకు ఎంత నష్టాన్నైనా భరించటానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ముస్లిం లీగ్ మాత్రం దేశ స్వాతంత్య్రం గురించి పట్టించుకోకుండా, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశ విభజనకు అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరింది.
వేవెల్ ప్రణాళిక (1945)
భారత వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.
ముఖ్యాంశాలు
➡︎ భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించిన వారికి సముచిత ప్రాతినిధ్యం కోసం వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని విస్తరించడం.
➡︎ భారతదేశంలోని బ్రిటిష్ వారి ప్రయోజనాలు కాపాడేందుకు హై కమిషనర్‌ను నియమించడం.
➡︎ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారిగా భారతీయుడిని నియమించడం.
➡︎ వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం. దీని కోసం వైస్రాయి 1945 జూలైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. కానీ కాంగ్రెస్ అవిభాజ్య భారత దేశం (యునైటెడ్ ఇండియా) కోసం పట్టు బట్టింది. ముస్లిం లీగ్ మాత్రం దేశ విభజనను సమర్థించింది.
కేబినెట్ మిషన్ (1946) (కేబినెట్ రాయబారం)
బ్రిటన్ ప్రధాని అట్లీ.. 1946 మార్చిలో పార్ల మెంటులో భారతదేశానికి అధికార బదిలీకి సంబంధించి ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. ‘అల్ప సంఖ్యాకుల హక్కులపై మాకు అవగాహన ఉంది. అల్పసంఖ్యాకులు నిర్భయంగా జీవించాలి. అయి తే అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్ప సంఖ్యాక వర్గాన్ని కూడా మనం అనుమతించలేం’ అని పేర్కొన్నారు. అందులో భాగంగా బ్రిటన్‌లో కేబి నెట్ మంత్రులైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్, లార్డ్ పెథిక్ లారెన్స్ సభ్యులుగా మంత్రుల బృందం భారత పర్యటన ప్రారంభించింది. ఈ బృందానికి సర్ పెథిక్ లారెన్స్ నేతృత్వం వహించారు. 1946 మే 16న వీరు తమ ప్రణాళికను వెల్లడించారు.
☛Follow our YouTube Channel (Click Here)
ముఖ్యాంశాలు
u బ్రిటిష్ పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానా లు, ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ యూనియన్ విదేశీ వ్యవ హారాలు, రక్షణ, కమ్యూనికేషన్ లాంటి జాతీయ ప్రాముఖ్యమున్న అంశాలను నిర్వహిస్తుంది.
u కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
u ప్రాతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పడుతాయి. పరిపాలనా నిర్వహణ కోసం 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
u పాకిస్తాన్ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు.
u రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది.
తాత్కాలిక ప్రభుత్వం (1946)
బ్రిటిష్ ప్రభుత్వం 1946 ఆగస్టు 24న∙తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. దీనికి అనుగుణంగా 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్, 1946 అక్టోబర్ 29న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెస్ తరఫున వల్లభాయ్æపటేల్, రాజేంద్ర ప్రసాద్, అరుణా అసఫ్ అలీ, రాజగోపాలాచారి, జగ్జీవన్‌రామ్ లాంటి ప్రముఖులు, ముస్లిం లీగ్ తరఫున లియాఖత్ అలీఖాన్, జె.ఎన్.మండల్, గజ్నేఫర్ అలీఖాన్ లాంటి నాయకులు మంత్రులుగా, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా వ్యవహరించారు.
అట్లీ్ల ప్రకటన (1947)
1947 ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ 1948 జూన్ నాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి వైదొలుగుతుందని ప్రకటించారు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు. ఈ ప్రకటనను బ్రిటిష్‌వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైందిగా మహాత్మాగాంధీ వర్ణించారు.
మౌంట్‌బాటన్ ప్రణాళిక(1947)
భారతదేశ రాజ ప్రతినిధి, గవర్నర్ జనరల్ గా నియమితుడైన మౌంట్‌బాటన్ దేశంలోని రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు జరిపి, సమైక్య భారతదేశ ప్రాతిపదికన కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీల మధ్య అంగీకారం కుదర్చడం సాధ్యం కాదనీ, దేశ విభజన ఒక్కటే పరిష్కారంగా భావించి ప్రణాళిక తయారు చేశారు.
☛ Follow our Instagram Page (Click Here)
ముఖ్యాంశాలు
u ఇండియన్ యూనియన్‌ను భారత్, పాకిస్తాన్ అనే రెండు రాజ్యాలుగా విభజిస్తారు.
u 1948 జూన్‌కు బదులుగా 1947 ఆగస్టు 15 న రెండు దేశాలుగా విడిపోతాయి.
u అసోం భారత్‌లో అంతర్భాగంగా ఉండగా బెంగాల్, పంజాబ్‌లను మత ప్రాతిపదికన విభజించారు. అయితే ముస్లింలు అధికంగా ఉండే సిల్హట్ (బెంగాల్) జిల్లా విషయంలో మాత్రం అది తూ ర్పు బెంగాల్‌లో లేదా అసోంలో చేరడమా అనే విషయం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జరుగుతుంది.
u బెలూచిస్థాన్ వాయవ్య ప్రాంతాలు భారత్ లేదా ΄ాకిస్తాన్‌లో కానీ చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
u పంజాబ్, బెంగాల్, అసోం లాంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను విభజించే విషయంలో రెండు సరిహద్దు సంఘాలను నియమించారు.
u బ్రిటన్ ఆధ్వర్యంలోని కామన్‌వెల్త్ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్తాన్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
భారత స్వాతంత్య్ర చట్టం (1947)
భారతదేశ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ కోసం రూపొందించిన చివరి చట్టం ఇదే. బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లీ ఆధ్వర్యంలో భారత గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్‌బాటన్ సలహా మేరకు 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంటులో భారత స్వాతంత్య్ర ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బ్రిటిష్ రాణి 1947 జూలై 18న సంతకం చేసింది. ఇది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
ముఖ్యాంశాలు
u ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి. వీటికోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటవుతాయి.
u స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారంతోపాటు భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దవుతుంది.
u బ్రిటిష్ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
u వైస్రాయ్ పదవి రద్దు అవుతుంది.
u రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది.
u గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగ పరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు.
u లార్డ్ మౌంట్‌బాటన్ మొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
గతంలో అడిగిన ప్రశ్నలు
1. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కింది వాటిలో సరికానిది?
ఎ)ఈస్టిండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాల రద్దు
బి) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం
సి) కౌన్సిల్‌లో న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్ ఇచ్చింది
డి) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు
2. కింది వాటిలో సరైంది?
ఎ)బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ ΄ోలీసు దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారె¯Œ హేస్టింగ్స్
బి) రెగ్యులేటింగ్ చట్టం–1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు ప్రతి΄ాదన
సి) ఎ, బి
డి) ఏదీకాదు
3. భారత ప్రభుత్వ చట్టం–1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
ఎ) రెండు బి) మూడు
సి) అయిదు డి) ఆరు
4. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
ఎ) వాట్సన్ బి) రాబర్డ్ క్లైవ్
సి) డూప్లెక్స్ డి) వారెన్ హేస్టింగ్స్
5. భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు?
ఎ) 1858 నవంబర్ 1
బి) 1857 నవంబర్ 1
సి) 1859 డిసెంబర్ 1
డి) 1857 డిసెంబర్ 1
6. భారత ప్రభుత్వ చట్టం–1919లోని ప్రధాన అంశం/అంశాలు?
ఎ) రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
బి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నిర్వచనం
సి) కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికార సంక్రమణం
డి) పైవన్నీ
7. పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించటానికి ఉద్దేశించిన మొదటి బ్రిటిష్ చట్టం?
ఎ) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం– 1861
బి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం–1862
సి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం– 1909
డి) భారత ప్రభుత్వ చట్టం– 1919
8. ‘గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం’ గా నెహ్రూ దేన్ని పేర్కొన్నారు?
ఎ) కేబినెట్ మిషన్
బి) మౌంట్‌బాటన్ ప్రణాళిక
సి) వేవెల్ ప్రణాళిక
డి) భారత ప్రభుత్వ చట్టం–1935
సమాధానాలు
1) డి 2) సి 3) బి 4) బి 5) ఎ 6) డి 7) ఎ 8) డి
☛ Join our Telegram Channel (Click Here)
మాదిరి ప్రశ్నలు
1. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం?
ఎ) అమెరికా రాజ్యాంగం
బి) బ్రిటిష్ రాజ్యాంగం
సి) ఐరిష్ రాజ్యాంగం
డి) భారత ప్రభుత్వ చట్టం
2. జతపరచండి.
1) పోర్ట్ ఫోలియో పద్ధతి
2) సివిల్ సర్వీసులు
3) మత నియోజక వర్గాలు
4) భారత న్యాయ సంస్కరణలు
ఎ) లార్డ్ మెకాలే
బి) లార్డ్ కార్న్ వాలిస్
సి) లార్డ్ కానింగ్
డి) లార్డ్ మింటో
ఎ) 1–సి, 2–బి, 3–డి, 4–ఎ
బి) 1–బి, 2–సి, 3–ఎ, 4–డి
సి) 1–డి, 2–ఎ, 3–బి, 4–సి
డి) 1–ఎ, 2–బి, 3–డి, 4–సి
3. కాలక్రమం ప్రకారం కింది వాటిని గుర్తించండి?
1) ప్రత్యేక నియోజకవర్గాలు
2) శాసన అధికారాల బదలాయింపు
3) ద్విసభా విధానం
4) డొమినియన్ ప్రతిపత్తి
ఎ) 1, 2, 3, 4, బి) 2, 1, 3, 4
సి) 3, 2, 1, 4 డి) 3, 4, 1, 4
4. ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ?
ఎ) సంప్రదాయ అధికారం
బి) సమ్మోహనాధికారం
సి) చట్టబద్ధ, హేతుబద్ధ అధికారం
డి) పైవన్నీ
సమాధానాలు
1) డి 2) ఎ 3) ఎ 4) సి
Tags
- Polity Study Material
- competitive exams study materials
- polity material and bit banks
- groups exams preparation
- appsc and tspsc polity material
- polity material in telugu
- model questions and material for polity exam
- study material and bit banks for polity in groups exams
- appsc and tspsc groups
- appsc and tspsc polity
- bit banks for polity exam preparation
- preparatory questions for polity exams
- Government Jobs
- government exams preparations
- preparation material for group exams
- Education News
- Sakshi Education News
- bitbanks in politics
- polity study materials for competitive exams