General Science Biology top 50 Bits in Telugu: మానవుడిలో ఆల్కహాల్ దేనిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
1. కింది వాటిలో పోలియో వ్యాధి లక్షణం ఏది?
1) తలనొప్పి
2) జలుబు
3) ఒళ్లునొప్పులు
4) కండరాల పక్షవాతం
- View Answer
- Answer: 4
2. కింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులేవి?
1) పోలియో, తట్టు
2) గవదబిళ్లలు, జలుబు
3) కలరా, టైపాయిడ్
4) 1, 2
- View Answer
- Answer: 4
3. పెన్సిలిన్ అనేది ఒక
1) సూక్ష్మ జీవి నాశకం
2) కీటక నాశకం
3) బయోఫెర్టిలైజర్
4) పైవేవీకాదు
- View Answer
- Answer: 1
4. మానవుడిలో ఆల్కహాల్ దేనిపై ప్రభావం చూపుతుంది?
1) హృదయం
2) కండరాలు
3) చర్మం
4) నాడీ మండలం
- View Answer
- Answer: 4
5. అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది?
1) పాలు
2) మాంసం
3) సముద్ర చేపలు
4) కూరగాయలు
- View Answer
- Answer: 3
6. సెల్యూలోజ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆహారానికి బరువునిస్తుంది
2) ఖనిజ లవణం
3) ఆహార నాళంలో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడుతుంది
4) ఆహారంలో సెల్యూలోజ్ లేకపోతే పూర్తిగా జీర్ణం కాదు
- View Answer
- Answer: 2
7. ఆహార వాహికలోని కండరాలు..?
1) నియంత్రిత కండరాలు
2) అనియంత్రిత కండరాలు
3) హృదయ కండరాలు
4) నియంత్రిత – అనియంత్రిత కండరాలు
- View Answer
- Answer: 4
8. కింది వాటిలో ఇనుము, ఇతర ఖనిజ మూలకాలు అధికంగా కలిగి ఉండేవి ఏవి?
1) పప్పు ధాన్యాలు
2) ఆకుకూరలు
3) మాంసం
4) బంగాళాదుంప
- View Answer
- Answer: 2
9. శ్వాసక్రియ కింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది?
1) కాంతి
2) పత్రహరితం
3) సరైన ఉష్ణోగ్రత
4) తేమ
- View Answer
- Answer: 3
10. మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవకణాలు ఏవి?
1) ఎర్ర రక్తకణాలు
2) తెల్ల రక్త కణాలు
3) నాడీకణాలు
4) కండర కణాలు
- View Answer
- Answer: 1
11. ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వెళ్లే రక్తనాళం?
1) పుపుససిర
2) పుపుస ధమని
3) పూర్వ మహాసిర
4) దైహిక ధమని
- View Answer
- Answer: 2
12. దేనిలో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది?
1) పుపుస ధమని
2) హృదయ/కరోనరీ ధమని
3) హృదయ సిర
4) పుపుస సిర
- View Answer
- Answer: 2
13. కింది వాటిలో సరికానిది ఏది?
1) రక్తం గడ్డకట్టకుండా ప్లాస్మా సేకరించవచ్చు
2) రక్తం గడ్డకట్టిన తరువాతే సీరమ్‌ను సేకరిస్తారు
3) ప్లాస్మాలో ఉండే కొన్ని ప్రోటీన్లు సీరమ్‌లో ఉండవు
4) ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం
- View Answer
- Answer: 4
14. రక్త వర్గాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) రక్త వర్గాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త – కార్ల్ లాండ్ స్టీనర్
2) ఆర్బీసీలపై ఉండే ప్రతిజనకాలు ఎ, బి ఆధారంగా ఎ, బి, ఎబి, ఒ అనే నాలుగు రకాల వర్గాలను గుర్తించారు
3) ప్రతిజనకాలు లేని రక్త వర్గం – ‘ఒ’, ప్రతి రక్షకాలు లేని వర్గం – ‘ఎబి’
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
15. కింది వాటిలో కొంత మంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి కారణం ఏది?
1) ఆర్‌హెచ్ కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడడం
2) ఆర్‌హెచ్ కారకానికి ప్రతి జనకాలు ఏర్పడడం
3) పైరెండూ
4) ఏదీకాదు
- View Answer
- Answer: 1
16. డయాలసిస్ యంత్రం ఒక
1) కృత్రిమ గుండె
2) కృత్రిమ ఊపిరితిత్తులు
3) కృత్రిమ కాలేయం
4) కృత్రిమ మూత్రపిండం
- View Answer
- Answer: 4
17. శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది?
1) మూత్రపిండాలు
2) ఊపిరితిత్తులు
3) కాలేయం
4) పెద్దపేగు
- View Answer
- Answer: 3
18. హృదయ కండరం ఏ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది?
1) గ్లానీ
2) లయ బద్ధత
3) సార్కాలెమ్మా
4) ఆకారం
- View Answer
- Answer: 2
19. అరేఖిత (నునుపు) కండరాలు ఏ భాగంలో ఉంటాయి?
1) మెడ
2) కాళ్లు–చేతులు
3) జీర్ణాశయం–మూత్రాశయం
4) వేళ్లు
- View Answer
- Answer: 3
20. వరి నారు మొక్కలో ‘తెలివి తక్కువ మొలక’ (Foolish Seedling Disease) వ్యాధికి కారణమయ్యేది?
1) వైరస్
2) బ్యాక్టీరియా
3) శైవలం
4) శిలీంధ్రం
- View Answer
- Answer: 4
21. ఆల్ఫా, బీటా–ఇంటర్ ఫెరాన్లను ఉత్పత్తి చేసేవి ఏవి?
1) వైరల్ సాంక్రమిక కణాలు
2) మైక్రోపేజ్లు
3) వైరస్లు
4) టి–కణాలు
- View Answer
- Answer: 1
22. పారిశ్రామికంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పదార్థాలు?
1) కార్న్‌స్టార్చ్, మొలాసిస్
2) షుగర్ బీట్లు, దుంపలు
3) ద్రాక్ష
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
23. చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా?
1) ట్రైకోమోనాస్
2) సుడోమోనాస్
3) రైనోసీరాస్
4) జాంతోమోనాస్
- View Answer
- Answer: 2
24. కింది వాటిలో సరికాని జత?
1) గ్లియోబ్లాస్టోమా – మెదడు
2) ఏంజియోసార్కోమా – రక్తం
3) లింపోమా – ప్లీహం
4) ఎడినో సార్కోమా – గ్రంథి కణజాలం
- View Answer
- Answer: 4
25. ప్రకృతి వరణాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన వారెవరు?
1) డార్విన్
2) వీజ్‌మన్
3) బెర్నాడ్ కెటిల్వెల్
4) సింప్సన్
- View Answer
- Answer: 3
26. మొక్కలతో సంశ్లేషణ చేయని విటమిన్?
1) బి12
2) బి6
3) బి1
4) ఇ
- View Answer
- Answer: 1
27. కింది వాటిలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆవాసం ఏది?
1) ఎడారులు
2) సమశీతోష్ణ అడవులు
3) ఉష్ణమండల వర్షారణ్యాలు
4) గడ్డి మైదానాలు
- View Answer
- Answer: 3
28. జీవ అనుఘటకాలు అంటే..?
1) వినియోగదారులు మాత్రమే
2) వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విచ్ఛిత్తికారులు
3) ఉత్పత్తి, వినియోగదారులు
4) ఉత్పత్తి దారులు మాత్రమే
- View Answer
- Answer: 2
29. ‘జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం–కణం’ అని పేర్కొన్న శాస్త్రవేత్త?
1) అరిస్టాటిల్
2) రాబర్ట్ హుక్
3) ష్లైడన్–ష్వాన్
4) జార్జ్ మెండల్
- View Answer
- Answer: 3
30. కేంద్రక పూర్వ జీవుల కణంలో లోపించిన కణాంగాలు ఏవి?
1) క్రోమోజోమ్స్
2) మైటోకాండ్రియా
3) ప్లాస్మామెంబ్రేవ్
4) రైబోజోమ్స్
- View Answer
- Answer: 2
31. ‘అల్లం’ మనం ఆహారంగా ఉపయోగించే భూగర్భకాండ రూపాంతరం. దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు?
1) రైజోమ్
2) కందం
3) దుంప
4) లశునం
- View Answer
- Answer: 1
32. జలగల పోషణ విధానం ఏది?
1) హెర్బివోరస్
2) ఇన్సెక్టివోరస్
3) కార్నివోరస్
4) సాంగ్వివోరస్
- View Answer
- Answer: 4
33. లివర్ సిర్రోసిస్‌కి కారణం?
1) కొకైన్
2) ఎల్ఎస్డీ
3) ఆల్కహాల్
4) మార్ఫిన్
- View Answer
- Answer: 3
34. జనటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో చాలా ఎక్కువగా ఉపయోగించే రెండు బ్యాక్టీరియాలు?
1) నైట్రసోమోనాస్, క్లెబ్సియెల్లా
2) ఎశ్చరీషియా, అగ్రోబ్యాక్టీరియమ్
3) నైట్రోబాక్టర్, అజటో బాక్టర్
4) రైజోబియం, డిప్లోకోకస్
- View Answer
- Answer: 2
35. జతపరచండి.
శాస్త్రవేత్త సిద్ధాంతం
i) డార్విన్ a) ఉపయుక్త– నిరుపయుక్త సూత్రం
ii) లామార్క్ b) జాతుల ఉత్పత్తి
iii) హ్యూగోడీవ్రీస్ c) జీవం ఆవిర్భావం
iv) ఎ.ఐ. ఒపారిన్ d) ఉత్పరివర్తన సిద్ధాంతం
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-a, iii-b, iv-d
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- Answer: 3
36. కింది వాటిలో సరైంది?
ఎ) అధిక కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం ఉండటం వల్ల క్లోరెల్లా శైవలాన్ని వ్యోమగాములు ఆక్సిజన్ కోసం అంతరిక్షానికి తీసుకెళతారు
బి) శైవలాలన్నీ స్వయం పోషకాలే కానీ, సిపాల్యురాస్ పరాన్న జీవి శైవలం
సి) కణజాల వర్ధనంలో పోషక యానకాన్ని అర్ధ–ఘనస్థితికి మార్చడానికి ఉపయోగించే అగార్–అగార్ శైవలాల నుంచి సంగ్రహిస్తారు
1) ఎ, సి
2) బి, సి
3) ఎ, బి
4) ఎ, బి, సి
- View Answer
- Answer: 4
37. మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవ మెదడులో ఏ భాగం బాగా అభివృద్ధి చెందింది?
1) మెడుల్లా అబ్లాంగేటా
2) అనుమస్తిష్కం
3) మస్తిష్కం
4) దృష్టి లంభికలు
- View Answer
- Answer: 3
38. శ్వాసక్రియ, హృదయ స్పందన, పెరిస్టాలిక్ చలనం మెదడులో ఏ భాగం అధీనంలో ఉంటుంది?
1) మెడుల్లా అబ్లాంగేటా
2) మెడుల్లా అబ్లాంగేట, మస్తిష్కం
3) మెడుల్లా అబ్లాంగేటా, అనుమస్తిష్కం
4) అనుమస్తిష్కం
- View Answer
- Answer: 1
39. సాధారణంగా వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయసు చెప్పవచ్చు. కానీ, కింది ఏ వృక్షాల్లో వార్షిక వలయాలు ఏర్పడకపోవడం వల్ల వయసు లెక్కించలేం?
1) సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు
2) సమశీతోష్ణ సతత హరిత అడవులు
3) ఉష్ణమండల ఆకురాల్చు అడవులు
4) ఉష్ణమండల సతత హరిత అడవులు
- View Answer
- Answer: 4
40. అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల సంక్రమిం చే వ్యాధులు ఏవి?
1) సిపిలిస్, గనేరియా
2) హెర్పిస్, ఎయిడ్స్
3) వైజైనెటిస్, ట్రైకోమోనియాసిస్
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
41. కింది వాటిలో తెల్ల రక్త కణాలు కానివి?
1) న్యూట్రోపిల్
2) బెసోపిల్
3) త్రాంబోసైట్
4) ఇసినోపిల్
- View Answer
- Answer: 3
42. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ దేనిలో ఉంటుంది?
1) చేప
2) బొద్దింక
3) ఆక్టోపస్
4) నాటిలస్
- View Answer
- Answer: 2
43. వినత్రీకరణ బ్యాక్టీరియా ఏది?
1) రైజోబియం
2) అనబీనా
3) నాస్టాక్
4) సూడోమోనాస్
- View Answer
- Answer: 4
44. జతపరచండి.
కల్చర్స్
i) ఆర్బోరికల్చర్
ii) టిష్యూకల్చర్
iii) పోమీకల్చర్
iv) ఒలెరికల్చర్
వివిధ రకాల మొక్కల పెంపకం
a) కూరగాయలు
b) కలపనిచ్చే మొక్కలు
c) ఉద్యానవన మొక్కలు
d) ఫలాలిచ్చే మొక్కలు
e) పరీక్ష నాళికలో మొక్కలు
1) i-b, ii-e, iii-c, iv-a
2) i-b, ii-e, iii-a, iv-c
3) i-e, ii-b, iii-a, iv-c
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- Answer: 1
45. గ్లూకోజ్‌ను ఏమని పిలుస్తారు?
1) గ్రేప్ షుగర్
2) ప్రూట్ షుగర్
3) లెవ్యూలోజ్
4) ప్రక్టోజ్
- View Answer
- Answer: 1
46. ద్వివార దంత విన్యాసం, థీకోడాంట్, విషమ దంతస్థితి సాధారణంగా ఏ జీవుల్లో ఉంటుంది?
1) చేపలు
2) సరీసృపాలు
3) ఉభయచరాలు
4) క్షీరదాలు
- View Answer
- Answer: 4
47. శరీర జీవ క్రియారేటును నియంత్రించే ముఖ్యమైన అంతస్రావ గ్రంథి ఏది?
1) పీనియల్ గ్రంథి
2) థైరాయిడ్ గ్రంథి
3) పిట్యూటరీ గ్రంథి
4) ఎడ్రినల్ గ్రంథి
- View Answer
- Answer: 2
48. ప్రోకారియేట్ జీవుల్లో ఉండే 70 రైబోసోమ్‌ల ఉపప్రమాణాలు?
1) 40 40
2) 60 40
3) 50 30
4) 50 50
- View Answer
- Answer: 3
49. అవయవదానం చేసే సమయంలో గ్రహీతకు ఇచ్చే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి తయారు చేస్తారు?
1) బ్యాక్టీరియా
2) ఫంగస్
3) వైరస్
4) మొక్కలు
- View Answer
- Answer: 2
50. కింది గృహ సంబంధ కాలుష్య కారణాల్లో ఎక్కువ రసాయన కాలుష్యాన్ని కలుగజేసేది ఏది?
1) బొగ్గును మండించడం
2) వంటగ్యాస్ మండించడం
3) మస్కిటోకాయల్స్ను మండించడం
4) రూమ్ స్ప్రేలు
- View Answer
- Answer: 1
51. ప్రపంచవ్యాప్తంగా ధ్వని కాలుష్యానికి అతి ముఖ్యమైన కారణం?
1) సంస్థల పరికరాలు
2) రవాణా వ్యవస్థ
3) చెరుకు, వస్త్రాలు, పేపర్ మిల్లులు
4) నూనె శుద్ధి కర్మాగారాలు, థర్మల్ పవర్ ప్లాంట్స్
- View Answer
- Answer: 2
52. సిగరెట్ పొగలోని పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?
1) ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తాయి
2) రక్తపీడనం పెంచుతాయి
3) కేన్సర్‌కు కారకమవుతాయి
4) పిండం పెరుగుదల తగ్గిస్తాయి
- View Answer
- Answer: 3
53. ‘వాతావరణ కాలుష్య సూచికలు’ అని వేటిని పిలుస్తారు?
1) లైకెన్లు, మాస్ మొక్కలు
2) డాప్నియా
3) ఖైరోనోమస్ లార్వా
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
54. ఆహారంగా ఉపయోగపడే మొక్కలోని భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) క్యారెట్ – భూగర్భకాండం
బి) అల్లం – ఫలం
సి) కాఫీ – పరిచ్ఛదం
డి) శాప్రాన్ (కుంకుమ పువ్వు)– కీలాగ్రం
1) ఎ, డి
2) ఎ, బి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- Answer: 3
55. కింది వాటిలో సరికాని జత?
ఎముక పేరు
ఉండే భాగం
ఎ) హ్యూమరస్– భుజాస్థి
బి) రేడియస్ అల్నా– మోకాలు
సి) పాలింజెన్స్– కపాలం
డి) ఫీమర్– తొడ ఎముక
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి
3) బి, డి
4) బి, సి
- View Answer
- Answer: 4
56. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) పేలినాలజీ – పరాగ రేణువుల అధ్యయన శాస్త్రం
బి) పేలియెంటాలజీ – శిలాజాల అధ్యయన శాస్త్రం
సి) డెండ్రాలజీ – వృక్షాల అధ్యయన శాస్త్రం
డి) డెండ్రోక్రోనాలజీ – వృక్షాల వయసు నిర్ధారించే శాస్త్రం
1) ఎ, డి
2) బి, సి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- Answer: 4
Tags
- General Science Biology top 50 Bits in Telugu
- General Science Biology Bitbank
- competitive exams bitbank
- general studies biology Bitbank
- biology question and Answers
- biology bit bank in telugu
- biology question bank for competitive exam
- General Science Biology General Knowledge questions for Competitive exam
- General Science Biology Questions and Answers for Competitive Exam
- Biology Online Test Bitbank
- telugu bitbank
- GK Telugu Bitbank
- Latest Telugu Bitbank
- top 50bits in General Science Biology
- important biology Bitbank for competitive exams in telugu
- biology Latest Bitbank
- Trending Bitbank
- competitive exams trending Bitbank
- GS Biology Bitbank for competitive exams
- TeluguMediumBiologyQuestions
- BiologyQuestionsForExams
- TeluguBiologyQuiz
- ExamPreparationTelugu
- ScienceBitsTelugu
- BiologyModelPapersTelugu
- TeluguBiologyForExams
- BiologyBitsInTelugu
- GeneralScienceBitsTelugu
- CompetitiveExamBiologyTelugu
- sakshieducation current affairs