Skip to main content

Disaster Management Study Material and Bits : సివిల్స్‌, గ్రూ‍ప్స్‌ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా.. భారత్‌లో విపత్తు నిర్వహణ స్థాయిలు..

భారతదేశంలో విపత్తు నిర్వహణ యాజమాన్యం
Comprehensive disaster management system in India  Impact of disaster management on economy  India disaster management before 2004 Study material and bits of disaster management for groups and civils exam

భారత్‌లో 2004 వరకు విపత్తు నిర్వహణ అనేది విపత్తులు సంభవించిన తర్వాత తీసుకునే పునరావాస, పునర్నిర్మాణ, ఉపశమన చర్యల రూపంలో మాత్రమే ఉండేది. ఇలాంటి విధానాలు, కార్యక్రమాల వల్ల విపత్తు ప్రభావిత ప్రాంత‌ ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లేది. ఈ నేపథ్యంలో 2004 డిసెంబర్‌ 26న సంభవించిన సునామీ.. మన దేశంలోని విపత్తు నిర్వహణ విధానాలు, కార్యక్రమాల్లోని లోపాలను తేటతెల్లం చేసింది. దీంతో భారత్‌ కూడా సమగ్ర విపత్తు నిర్వహణ విధానాన్ని రూపోందించి అమలు చేస్తోంది.
ఈ మేరకు అమెరికా, జపాన్‌ విధానాలను, కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భాగంగా 2005 మే 20న జాతీయ విపత్తు నిర్వహణ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టాన్ని అనుసరించి విపత్తుల సమగ్ర నిర్వహణ కోసం 2005 మే 30న జాతీయ విపత్తు నిర్వహణ పాధికారక సంస్థ (NDMA)ను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 డిసెంబర్‌ 23 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీంతో చట్టంలోని సెక్షన్‌ 3(1) ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ పాధికారక సంస్థ.. 2006 సెప్టెంబర్‌ 27న ప్రధాని అధ్యక్షతన మరో 9 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. సభ్యుల్లో ఒకరు వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

COE Admissions : బాలిక‌ల గురుకుల సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో ఖాళీ సీట్ల భర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఈ త‌ర‌గ‌తుల్లోనే..

➦    ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం–2005’ను అనుసరించి మన దేశంలో విపత్తు నిర్వహణ పర్యవేక్షణ 3 స్థాయిల్లో జరుగుతుంది. అవి..
1.    ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్రస్థాయిలో జా­తీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థలో 
2.    ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థలో 
3.    కలెక్టర్‌/మేజిస్ట్రేట్‌/డిప్యూటీ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయిలో జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థలో
1.    NDMA అధికార పరిధి: 
ఎ)    విపత్తు ముప్పును నివారించేందుకు లేదా తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు అమలుచేయాల్సిన విధానాలను, అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపోందించడం.
బి)    విపత్తు నిర్వహణ ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్ర ప్రాధికారక సంస్థలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపోందించ‌డం.

విపత్తు నిర్వహణకు NDMA తీసుకున్న చర్యలు
యొకహామా డిక్లరేషన్‌–1994
విపత్తుల నివారణ, ఉపశమనానికి సంబంధించి జ΄ాన్‌లోని యొకహామా నగరంలో రూ΄÷ందించిన తీర్మానానికి అనుగుణంగా మన దేశంలో విపత్తుల నిర్వహణ అంశాన్ని తొలిసారిగా 10వ పంచవర్ష ప్రణాళికా కాలంలో చేరుస్తూ సమగ్ర విధానాన్ని రూపోందించారు. ఇదే సదస్సు 1991–2000 దశాబ్దాన్ని ‘ఇంటర్నేషనల్‌ డికేడ్‌ ఫర్‌ నేచురల్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌’గా ప్రకటించింది. యొకహామా సదస్సు స్ఫూర్తితో విపత్తుల అధ్యయనానికి 1999లో కేసీ పంత్‌ అధ్యక్షతన అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. 
హ్యోగో కార్యచట్రం
హ్యోగో(జపాన్‌)లోని కోబేలో 2005 జనవరి 18నుంచి 22వరకు జరిగిన సమావేశం.. 2005–15 మధ్యకాలంలో అమలుచేయాల్సిన సమగ్ర కార్యా­చరణ ప్రణాళికను ‘హ్యోగో ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ యాక్షన్‌ 2005–15’ పేరిట విడుదల చేసింది. 168 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో.. విపత్తుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకొనే సామ­ర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా జనసమూహంలో పెంపోందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని, అమలు­చేయాల్సిన మార్గదర్శకాలను రూపోందించారు.
➦    విధి నిర్వహణలో ఎన్‌డీఎంఏకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సహకరించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్‌–8 ప్రకారం వివిధ సంఘాలను ఏర్పాటుచేశారు. అవి.. 

Gender Equality: వర్ణ వివక్షపై పోరాడిన నేలలో లింగ వివక్ష..!

ఎ.    జాతీయ కార్యనిర్వాహక కమిటీ (ఎన్‌ఈసీ): దీనికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎక్స్‌అఫిషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అంటే పదవీ రీత్యా ఎన్‌ఈసీ చైర్మన్‌గా ఉంటారు.
బి.    జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం): ఇది కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. హోంమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించే ఈ సంస్థ 2003 అక్టోబర్‌ 16న చట్టబద్ధతను పొందింది. విపత్తు నిర్వహణను సంస్థాగతం చేసేందుకు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తగిన శిక్షణ అందించడం; వారిలో సంబంధిత సామర్థ్యాలను పెంపొందించడం; విపత్తు నిర్వహణకు సంబంధించిన పరిశోధనలను నిర్వహించడం; గ్రంథస్తం చేయడం, విద్యా సంబంధ కోర్సులను, సెమినార్లను నిర్వహించడం; పరిశోధన పత్రాలను, పుస్తకాలను ప్రచురించడం ఈ సంస్థ విధులు. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన మొత్తం 42 మంది సభ్యులు ఉంటారు.
సి.    జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌): విపత్తుల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకునేందుకు తగిన సహాయ కార్యక్రమాలను చేపట్టడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. దీన్ని జాతీయ విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్‌ 44 ప్రకారం 2006లో ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా ఆ ఊ (బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) ఇఖ్కఊ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌) ఇఐ ఊ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌), ఐఖీఆ్క (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌)లకు చెందిన 10 బెటాలియన్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అవి.. 
    1. భటిండా (పంజాబ్‌) 
    2. గౌహతి (అసోం)
    3. వడోదర (గుజరాత్‌)
    4. గ్రేటర్‌ నోయిడా (ఉత్తరప్రదేశ్‌)
    5. బరాసత్‌ (పశ్చిమ బెంగాల్‌)
    6. పుణె (మహారాష్ట్ర)
    7. మంగళగిరి (ఆంధ్రప్రదేశ్‌)
    8. అరక్కోణం (తమిళనాడు)
    9. ముందలి (ఒడిశా)    
    10. బిహాటా (బిహార్‌)

Sainik School Recruitment 2024: సైనిక్ స్కూల్ కోరుకొండ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024: దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

డి.    జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డీఎంఎఫ్‌): విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణ సాయం అందించేందుకు 2001లో ఏర్పాటుచేసిన ‘నేషనల్‌ క్లైమెట్‌ కంటింజెన్సీ ఫండ్‌’ను రాష్ట్ర స్థాయిల్లోని ‘క్లైమెట్‌ రిలీఫ్‌ ఫండ్‌’తో కలిపి దీన్ని 2010లో ‘నేషనల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఫండ్‌(ఎన్‌డీఎంఎఫ్‌)’గా మార్చా­రు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో నిధులను సమకూరుస్తాయి. 
ఇ.    జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ): విపత్తుల వల్ల ఏర్పడ్డ సంక్షోభాన్ని నివారించేందుకు నియమించిన సంక్షోభ నిర్వహణ బృందానికి ఈ కమిటీ మార్గనిర్దేశం చేస్తుంది. దీనికి కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. 

గతంలో అడిగిన ప్రశ్నలు:
1.    విపత్తు నిర్వహణ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం? (Junior Assistant in Intermediate Board-2012)
    ఎ) 2004    బి) 2005
    సి) 2006    డి) 2003

2.    జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ అధ్యక్షుడు?    (Polytechnic Lecturers)
    ఎ) ఆర్థిక మంత్రి
    బి) ప్రధాన మంత్రి
    సి) సమాచార ప్రసార శాఖ మంత్రి    
    డి) గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

3.    జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? (Jr. Assistants in vidhana sabha)
    ఎ) సూరత్‌     బి) కొచ్చి 
    సి) కటక్‌     డి) న్యూఢిల్లీ

4.    విపత్తు నిర్వహణ కార్యకలా΄ాలను సమన్వయం చేసే మంత్రిత్వ శాఖ? (RTA Exam)
    ఎ) గృహ మంత్రిత్వ శాఖ
    బి) పర్యావరణ శాఖ
    సి) ఆహార మంత్రిత్వ శాఖ
    డి) ఆర్థిక శాఖ 

5.    జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక?    (Group-I, 2011)    
        ఎ) Disaster & Development
    బి) Disaster India
    సి) Disaster mitigation
    డి) Indian disaster

6.    భారత విపత్తు నిర్వహణ కాంగ్రెస్‌ మొదటి సభ ప్రారంభమైన రోజు?    (Group-I, 2011)
    ఎ) 26–10–2006    
    బి) 29–08–2006
    సి) 29–11–2006
    డి) 29–10–2006
7.    ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం–2005’లో ΄పొందుపర్చిన నిర్వహణ స్థాయి? (Comp­u­ter draughtsmen grade-II)
    ఎ) జాతీయ విపత్తు నిర్వహణ 
         ప్రాధికారక సంస్థ
    బి) రాష్ట్ర విపత్తు నిర్వహణ
         ప్రాధికారక సంస్థ 
    సి) జిల్లా విపత్తు నిర్వహణ
        ప్రాధికారక సంస్థ
    డి) పైవన్నీ
సమాధానాలు:
    1) బి;        2) బి;     3) డి;     4) ఎ; 
    5) ఎ;       6) సి;    7) డి;

Master of Engineering Admissions : సీఐటీడీలో ఇంజ‌నీరింగ్ కోర్సులు.. ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు ఇలా..

మాదిరి ప్రశ్నలు:
1.    జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 
    ఎ) 2005 డిసెంబర్‌ 25
    బి) 2005 డిసెంబర్‌ 24
    సి) 2005 డిసెంబర్‌ 23
    డి) 2005 డిసెంబర్‌ 20

2.    జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి 
వచ్చింది?  
    ఎ) 2006 సెప్టెంబర్‌ 24
    బి) 2006 సెప్టెంబర్‌ 25
    సి) 2006 సెప్టెంబర్‌ 27
    డి) 2006 సెప్టెంబర్‌ 26

3.    విపత్తుకు ముందు తీసుకునే చర్యలు?
    ఎ) నివారణ    బి) సంసిద్ధత
    సి) ఉపశమనం     డి) పైవన్నీ

4.    విపత్తు తర్వాత తీసుకునే చర్యలు? 
    ఎ) పునరావాసం    బి) పునర్నిర్మాణం
    సి) ఉపశమనం    డి) పైవన్నీ

5.    జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) ­సభ్యుల సంఖ్య?
    ఎ) 39        బి) 9
    సి) 41        డి) 42

6.    NఐఈM ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
    ఎ) 2007 ఫిబ్రవరి 19
    బి) 2007 ఫిబ్రవరి 20
    సి) 2007 ఫిబ్రవరి 21
    డి) 2007 ఫిబ్రవరి 23

7.    విపత్తు నిర్వహణకు సంబంధించిన జాతీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు  ఆమోదించింది?
    ఎ) 2009 అక్టోబర్‌ 19
    బి) 2009 అక్టోబర్‌ 20
    సి) 2009 అక్టోబర్‌ 21
    డి) 2009 అక్టోబర్‌ 22

8.    హోంగార్డ్‌ వ్యవస్థ లేని రాష్ట్రం?
    ఎ) మహారాష్ట్ర    బి) కర్ణాటక
    సి) కేరళ            డి) ఒడిశా

సమాధానాలు:
1) సి;    2) సి;    3) డి;    4) డి;
5) డి;    6) డి;    7) సి;    8) సి.

Ph D Admissions : ట్రిపుల్‌ఐటీడీఎంలో ఫుల్‌టైం పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 26 Aug 2024 09:03AM

Photo Stories