Skip to main content

Disaster Management Notes for Groups: మార్కులు తెచ్చే.. విపత్తుల నిర్వహణ

disaster management preparation tips and guidance for groups
disaster management preparation tips and guidance for groups

అన్ని పోటీ పరీక్షల్లో విపత్తుల నిర్వహణ అనేది అధిక ప్రాధాన్యత సంతరించుకున్న ముఖ్య అంశం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అధిక స్థాయిలో విపత్తుల తీవ్రత పెరుగుతున్నట్టు ఐక్యరాజ్య సమితి(యూఎన్‌ఓ)తోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. అభ్యర్థులు ఈ విషయాలను గుర్తించి విపత్తుల నిర్వహణ అంశాలను సరైన రీతిలో చదవాలి. విపత్తు నిర్వహణలో ప్రధానంగా విపత్తులు–రకాలు, అవి ఏర్పడే విధానం, వాటికి సంబంధించిన వర్గీకరణ, తీవ్రత, వాటి అధ్యయనంలో వచ్చే ప్రత్యేక పదజాలంపై దృష్టి పెట్టాలి.

పదాల మూలాలపై ప్రశ్నలు
విపత్తులపై అనేక రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విపత్తులకు సంబం« దించిన పదాల మూలంపై ప్రశ్నలు వస్తాయి. ఇది వరకు వచ్చాయి కూడా. ఉదా: డిజాస్టర్‌ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అని అడిగారు. ఫ్రెంచ్‌ పదం డిజాస్ట్రీ (Disastre) నుంచి ఈ ఆధునిక పదం వచ్చింది. అదే విధంగా (Cyclone) అనే పదం ఇyఛి ౌటఅనే గ్రీకు పదం నుంచి వచ్చింది. Tsunami అనేది Tsu, nami అనే రెండు జపాన్‌ పదాల నుంచి వచ్చింది. కాబట్టి వీటి నుంచి మొదలుకొని విపత్తు గురించి చదివేటప్పుడు.. అది ఏర్పడే విధానం, వాటి స్థాయి, వర్గీకరణ గురించి కూడా తెలుసుకోవాలి. వీటికి అదనంగా విపత్తుల సంఘటనలపై దృష్టి సారించాలి. ఇటీవలి కాలంలో భారత్‌తోపాటు, ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తులపై సమాచారాన్ని సేకరించాలి. 

తుపాన్‌ 'నిస‌ర్గ'కి ఆ పేరు ఏ దేశం పెట్టిందో తెలుసా?
 
తుఫాన్లు–వాటి పేర్లు
ఇటీవలి కాలంలో బంగాళాఖాతంలో,అరేబియా సముద్రంలో సంభవించిన తుఫాన్లు, వాటి పేర్లు, వాటి అర్థాలు, వాటిని ఏ దేశం ప్రతిపాదించిందో తెలుసుకోవాలి. బంగాళాఖాతంలో సంభవించిన అసని తుఫాను పేరును ఇప్పటికే రూపొందించిన 169 తుపాన్ల పేర్ల జాబితా నుంచి తీసుకున్నారు. 
అసని పేరు ఏ దేశం ప్రతిపాదించింది, దాని అర్థం ఏంటి.. అని కూడా తెలుసుకోవాలి. అసని పేరును శ్రీలంక ప్రతిపాదించింది. సింహళీ భాషలో ఈ పదానికి ఆగ్రహం అని అర్థం. ఈ విధంగా విషయాలను క్షుణ్నంగా చదవడం ద్వారా పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడిగినా.. సరైన సమాధానాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది.

‘విపత్తు’ అనే పదాన్ని ఏ భాషా పదజాలం నుంచి గ్రహించారు?

విపత్తుల నిర్వహణ వ్యవస్థ
విపత్తులకు సంబంధించిన సాంకేతిక అంశాలకు అదనంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను చదువుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో యొకొహమ డిక్లరేషన్, హ్యోగో ప్రణాళిక, సెండాయ్‌ ప్రణాళికలపై సమాచారం ఉండాలి. ఆ తర్వాత భారత్‌లో విపత్తు నిర్వహణ వ్యవస్థపై విపులంగా చదవాలి.

విపత్తు నిర్వహణ చట్టం
దేశంలో విపత్తు నిర్వహణ చట్టం, 3 అంచెల నిర్వహణ వ్యవస్థ (NDMA, SDMA, DDMA), జాతీయ విపత్తు స్పందన దళం (National Disaster Response Force), అదే విధంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (NIDM) రూపంలో మొత్తం వ్యవస్థను చదువుకోవాలి. 2009 నాటి National Policy on Disaster Management, 2016 నాటి National Disaster Management plan వంటి విధానాలను చదువుకోవాలి. 

సరికొత్త సాంకేతిక అంశాలు
ఇటీవలి వరదలు, తుఫాన్లు, భూకంపాలు మాత్రమే కాకుండా.. భూతాపాలు, హిమపాతాలు, భారీ అగ్ని పర్వతాలు వంటి వాటిపై అవగాహనను పెంపొందించుకోవాలి. విపత్తుల నిర్వహణపై దేశంలో ఇటీవలి కాలంలో వచ్చిన సరికొత్త సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించాలి. ఉదాహరణకు.. భూకంపాలపై తక్షణ సమాచారాన్ని అందించే మొబైల్‌ యాప్‌ ’India Quake’, అలాగే విపత్తుల నిర్వహణతో ముడిపడిన భారతదేశ సంస్థలను కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదా.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో కలిసి Early Earthquake warning వ్యవస్థను ఐఐటీ రూర్కీ అభివృద్ధి చేసింది. ఇటువంటి విషయాలపై కూడా అభ్యర్థులు దృష్టిసారించాలి. అంతేకాకుండా రాష్ట్ర్రాల వారీగా విపత్తు నిర్వహణ చర్యలు ఏమి జరుగుతున్నాయి అని కూడా తెలుసుకోవాలి.

– ఇ. హరికృష్ణ, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌
 
మాదిరి ప్రశ్నలు
1.    భూకంప సమయంలో జనించే మొదటి తరంగాలు
ఎ) పి– తరంగాలు    
బి) ఎస్‌– తరంగాలు
సి) లవ్‌ తరంగాలు   
డి)రేలిఘ తరంగాలు
సమాధానం: ఎ
2.    మెర్కల్లి స్కేలులో గరిష్టంగా ఎన్ని పాయింట్లు ఉంటాయి?
ఎ) 8
బి) 11
సి) 12
డి) 14
సమాధానం: సి
3.    నిసర్గ తుఫానుకు ఆ పేరు పెట్టిన దేశం?
ఎ) భారత్‌
బి) బంగ్లాదేశ్‌
సి) శ్రీలంక
డి) థాయ్‌లాండ్‌
సమాధానం: బి
4.    2014లో భూపాతం (కొండ చరియలు విరిగిపడి) కారణంగా భూస్థాపితం అయిన మాలిన్‌ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మధ్యప్రదేశ్‌     
బి) మహారాష్ట్ర
సి) గుజరాత్‌   
డి) ఒడిషా
సమాధానం: బి
5.    భూకంప తీవ్రత ఆధారంగా భారత్‌ను నాలుగు భాగాలుగా విభజించినది?
ఎ) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా
బి) నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ
సి) బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌
డి) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌గ్రఫీ
సమాధానం: సి
6.    హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లకు నామకరణం ద్వారా ప్రస్తుతం ఎన్ని దేశాలు లబ్ధి పొందుతున్నాయి?
ఎ) 8  
బి) 10   
సి) 13   
డి) 17
సమాధానం: సి

ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి?

Published date : 25 May 2022 06:29PM

Photo Stories