TET/DSC – ప్రత్యేకం బయాలజీ Bitbank: అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు?
1. వైద్యుడు ఒక వ్యక్తికి నిమ్మ, ఉసిరి, జామకాయలు తినాలని సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తిలో ఏ వ్యాధి లక్షణాలను గుర్తించి ఉండవచ్చు?
1) రికెట్స్
2) రేచీకటి
3) బెరి బెరి
4) స్కర్వీ
- View Answer
- Answer: 4
2. వ్యాధులకు సంబంధించి కింది వాటిలో ఏ రెండు సరైనవి?
ఎ. బోదకాలు వ్యాధి ఉకరేరియా బ్రాంక్రాప్టి అనే క్రిమి వల్ల వస్తుంది
బి. మలేరియా పరాన్న జీవికి ఒక అతిథేయి క్యూలెక్స్ దోమ
సి. మెదడు వాపు వ్యాధి క్యూలెక్స్ దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది
డి. బోదకాలు వ్యాధి అనాఫిలస్ దోమ వల్ల కలుగుతుంది
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, డి
4) సి, డి
- View Answer
- Answer: 2
3. లైంగిక ద్విరూపకత అంటే?
1) స్త్రీ, పురుష జీవులు ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి
2) స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఒకే జీవిలో ఉంటాయి
3) స్త్రీ, పురుష జీవులు బాహ్య లక్షణాల్లో వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి
4) అంతర్గత వ్యవస్థలు వేరుగా ఉన్నా, బాహ్యంగా స్త్రీ, పురుష జీవులు ఒకే లక్షణాలతో ఉంటాయి
- View Answer
- Answer: 3
4. కిరణ జన్య సంయోగ క్రియ జరిగిందని తెలుసుకోవడానికి చేసే పరీక్ష ఏది?
1) ఓౖఏ పరీక్ష
2) గ్లిసరిన్ పరీక్ష
3) అయోడిన్ పరీక్ష
4) లైట్ స్క్రీన్ పరీక్ష
- View Answer
- Answer: 3
5. పశువులు కలుషితమైన మేత తినడం వల్ల ప్రబలే వ్యాధి ఏది?
1) ఆటలమ్మ
2) గంభోరో వ్యాధి
3) మేడ్–కౌ వ్యాధి
4) రేబిస్ వ్యాధి
- View Answer
- Answer: 3
6. కలుపు మొక్కలను చేత్తో లాగే యడం, దున్నడం, కత్తిరించడం, కాల్చేయడం లాంటివి ఏ రకమైన పద్ధతి కిందకి వస్తాయి?
1) రసాయన పద్ధతి
2)బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి
3) భౌతిక పద్ధతి
4) జీవ క్రియా విధాన పద్ధతి
- View Answer
- Answer: 3
7. చర్మంలోని మెలనిన్ ఏ కిరణాల నుంచి రక్షణ ఇస్తుంది?
1) అతినీల లోహిత కిరణాలు
2) పరావర్తన కిరణాలు
3) ఎక్స్ కిరణాలు
4) అన్ని రకాల కాంతి కిరణాలు
- View Answer
- Answer: 1
8. కనుపాప తారక చేసే క్రియను దేని క్రియతో పోల్చవచ్చు?
1) కెమెరా కటకం
2) కెమెరా డయాఫ్రం
3) కెమెరా ఫిల్మ్
4) కెమెరా ఫ్లాష్
- View Answer
- Answer: 2
9. ఏ పాములు న్యూరో టాక్సిన్లను కలిగి ఉంటాయి?
1) కట్ల పాము
2) రక్త పింజర
3) పైథాన్
4) బురద పాము
- View Answer
- Answer: 1
10. శ్లేష్మంలో కలిగే రసాయనాల వాసనను గ్రహించేవి?
1) జిహ్వ గ్రాహకాలు
2) ఘ్రాణ గ్రాహకాలు
3) శ్రవణ గ్రాహకాలు
4) స్పర్శ గ్రాహకాలు
- View Answer
- Answer: 2
11. నిల్వ చేసే ప్రక్రియలో ‘క్యూరింగ్’ అంటే?
1) ఈస్ట్‌ను ఉపయోగించి ఆల్కహాల్‌ను తయారు చేయడం
2) పాలను పెరుగుగా మార్చి నిల్వ చేయడం
3) పాలను వేడి చేసి మీగడను వేరు చేయడం
4) కాటేజ్ జున్నును కొన్ని పద్ధతుల ద్వారా మార్చడం
- View Answer
- Answer: 4
12. కిణ్వ ప్రక్రియ అనేది ఏ వాయువు లేనప్పుడు ఈస్ట్ కణాలు జరిపే ఒక రకమైన శ్వాసక్రియ?
1) CO2
2) H2
3) O2
4) CO
- View Answer
- Answer: 3
13. ఏ దేశస్థులు జిగట విరేచనాలు, ఎల్లో జ్వరానికి ఎక్కువ ప్రతినిరోధకత కలిగి ఉంటారు?
1) ఆఫ్రికన్లు
2) యూరోపియన్లు
3) భారతీయులు
4) అమెరికన్లు
- View Answer
- Answer: 1
14. రిఫ్రిజరేటర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసే సరైన ఉష్ణోగ్రత?
1) 5°C&15°C
2) 4°C&10°C
3) 20°C--&25°C
4) 0°C&10°C
- View Answer
- Answer: 4
15. నూనె గింజలనిచ్చే మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ. సన్ ఫ్లవర్ – హీలియాంథస్ ఏన్యూనస్
బి. ఆవాలు–సిసమమ్ ఇండికమ్
సి. వేరుసెనగ – అరాఖిస్ హై΄ోజియా
డి. పామ్ – ఇలుసిస్ గైనన్‌సిస్
1) ఎ, సి
2) బి, సి
3) బి, డి
4) ఎ, డి
- View Answer
- Answer: 3
16. మొక్క సాధారణ నామం, అందులో ఉండే ఔషధానికి సంబంధించి కిందివాటిలో సరైన జత ఏది?
ఎ. తులసి – కేంపర్
బి. పెరూవియన్ – క్వినైన్
సి. పాయిసన్ నట్ – మార్ఫిన్
డి. డెడ్లీవైట్షేడ్ – బ్రూసిన్
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి
- View Answer
- Answer: 1
17. శరీరంలో పాకకుండా, అపాయం చేయని వ్రణాలను ఏమంటారు?
1) మాలిగ్నెంట్ గడ్డలు
2) బినైన్ గడ్డలు
3) కార్సినోమా
4) సార్కోమా
- View Answer
- Answer: 2
18. ఆస్టియోసైట్ కణాలు ఏ కణజాలంలో ఉంటాయి?
1) మృదులాస్థి
2) కండర
3) అస్థి
4) సంయోజక
- View Answer
- Answer: 3
19. ఫ్రౌడ మానవునిలో దంతాల సంఖ్యకు సంబంధించి సరైంది?
1) 36
2) 38
3) 32
4) 34
- View Answer
- Answer: 3
20. చిన్న పిల్లల జఠర రసంలో మాత్రమే కనిపించే ఎంజైమ్?
1) పెప్సిన్
2) ట్రిప్సిన్
3) ఎంటిరోకైనేజ్
4) రెనిన్
- View Answer
- Answer: 4
21. నెమరువేసే జంతువుల్లో ‘జాలకం’ అనేది?
1) జీర్ణాశయంలో మూడో గది
2) జీర్ణాశయంలో రెండో గది
3) జీర్ణాశయంలో మొదటి గది
4) జీర్ణాశయంలో నాలుగో గది
- View Answer
- Answer: 2
22. కిందివాటిలో సరైన జత ఏది?
ఎ. తుమ్మ – రెసిన్
బి. సింకోనా – క్వినైన్
సి. రబ్బరు చెట్టు – లేటెక్స్
డి. వివృత బీజాలు – టానిన్
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి
- View Answer
- Answer: 2
23. మూత్రపిండంలో నిమిషానికి ఏర్పడే మూత్ర పరిమాణం?
1) 90 మి.లీ.
2) 75 మి.లీ.
3) 100 మి.లీ.
4) 120 మి.లీ.
- View Answer
- Answer: 4
24. మంచినీటిలో ఎక్కువ భాగం వేటిలో/ ఎక్కడ ఉంటుంది?
1) నదులు
2) సముద్రాలు
3) సరస్సులు
4) ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో
- View Answer
- Answer: 4
25. శ్వాసక్రియలో అంత్య పదార్థాలుగా ఏర్పడేవి?
1) O2, CO2 మిశ్రమం
2) CO2, N2
3) CO2, H2O
4) H2O, O2
- View Answer
- Answer: 3
26. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే?
1) భూమిపై ఎక్కువ మొక్కలు ఉండటం
2) వాతావరణంలోని ఇౖ2 వల్ల భూమి ఉష్ణోగ్రత పెరగడం
3) చెట్లతో కప్పిన ఇళ్లలో చల్లగా ఉండటం
4) పర్యావరణంలో మార్పు కోసం ఆకుపచ్చని చెట్లు పెంచడం
- View Answer
- Answer: 2
27. మృత్తిక ఏర్పడే పద్ధతిని ఏమంటారు?
1) ఫెదరింగ్
2) వార్మింగ్
3) విదరింగ్
4) ఫిక్సింగ్
- View Answer
- Answer: 3
28. మానవునిలో కేంద్రకం లేని రక్త కణం?
1) లింఫోసైట్
2) బేసోఫిల్
3) మోనోసైట్
4) ఎరిత్రోసైట్
- View Answer
- Answer: 4
29. కిందివాటిలో ఏ విత్తనాల్లో అధిక శాతం ్ర΄ోటీన్లు ఉంటాయి?
1) వేరుసెనగ
2) పొద్దు తిరుగుడు
3) సోయా చిక్కుడు
4) బఠాని
- View Answer
- Answer: 3
30. అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు?
1) 32 సార్లు
2) 20 సార్లు
3) 15 సార్లు
4) 22 సార్లు
- View Answer
- Answer: 1
31. కిరణజన్య సంయోగ క్రియను సూచించే సరైన రసాయన సమీకరణం?
1)12CO2 + 12H2O → C6H12O6 + 6O2 + 6H2O
2) 6CO2 + 6H2O → C6H12O6 + 6O2 + 6H2O
3) 6CO2 + 12H2O → C6H12O6 + 6O2 + 6H2O
4) 12CO2 + 6H2O → C6H12O6 + 6O2 + 9H2O
- View Answer
- Answer: 3
32. కాండం పెరుగుదల, ఫైటోహార్మోన్లకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1) జిబ్బరిలిన్లు.. ఆక్సిన్ల సమక్షంలో ప్రోత్సహించవు
2) ఆక్సిన్లు ప్రోత్సహిస్తాయి
3) ఆబ్సిసిక్ ఆమ్లం ప్రోత్సహిస్తుంది
4) ఇథైలీన్ ప్రోత్సహిస్తుంది
- View Answer
- Answer: 2
33. పరధీయ నాడీ వ్యవస్థలో 43 జతల నాడులుంటాయి. వీటిలో కపాల, వెన్ను నాడులకు సంబంధించి సరైంది ఏది?
1) వెన్ను నాడులు 30 జతలు; కపాల నాడులు 13 జతలు
2) కపాల నాడులు 12 జతలు; వెన్ను నాడులు 31 జతలు
3) వెన్ను నాడులు 12 జతలు; కపాల నాడులు 31 జతలు
4) కపాల నాడులు 9 జతలు; వెన్ను నాడులు 34 జతలు
- View Answer
- Answer: 2
34. శిశువు నీరసించి, శుష్కించి ఉంటాడు. కాళ్లు, చేతులు పుల్లల్లాగా మారతాయి. కడుపు ఉబ్బి ఉంటుంది. రోమాలు పెర గవు. అతిసార వ్యాధితో బాధపడతాడు. ఈ లక్షణాలు ఏ వ్యాధికి సంబంధించి నవి?
1) క్యాషియోర్కర్
2) స్కర్వీ
3) మరాస్మస్
4) రికెట్స్
- View Answer
- Answer: 3
35. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండ కణం ఫలదీకరణం చెందే భాగం ఏది?
1) గర్భాశయం
2) యోని
3) ఫాలోపియన్ నాళం
4) స్త్రీ బీజకోశం
- View Answer
- Answer: 3
36. పారమీషియంలో శారీరక క్రియలను నియంత్రించేది ఏది?
1) స్థూల కేంద్రకం
2) సూక్ష్మ కేంద్రకం
3) ప్రవాస ప్రాక్కేంద్రకం
4) స్థిర ప్రాక్కేంద్రకం
- View Answer
- Answer: 1
37. కప్ప ‘స్పాన్’లలో ఉండే కణాలు ఏ రకమైనవి?
1) శుక్ర కణాలు
2) అండ కణాలు
3) శుక్ర మాతృ కణాలు
4) అండ,శుక్ర కణాలు కలిసి ఉంటాయి
- View Answer
- Answer: 2
38. ల్యూటినైజింగ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే నిర్మాణం ఏది?
1) పీయూష గ్రంథి మధ్య లంబిక
2) కాలాంచిక
3) పీయూష గ్రంథి పర లంబిక
4) థైరాయిడ్ గ్రంథి
- View Answer
- Answer: 3
39. కిందివాటిలో అంకురచ్ఛదం ఉండని విత్తనం?
1) ఆముదం
2) మొక్కజొన్న
3) వరి
4) చిక్కుడు
- View Answer
- Answer: 4
40. హెచ్ఐవీ వైరస్ మానవునిలో ప్రవేశించే విధానాలకు సంబంధించి సరైంది ఏది?
ఎ. వ్యాధిగ్రస్థుల దుస్తులు, ఆహారం పంచుకున్నప్పుడు వ్యాపిస్తుంది
బి. వ్యాధిగ్రస్థులతో లైంగిక సంపర్కం వల్ల వ్యాప్తి చెందుతుంది
సి. దగ్గుతున్న వ్యాధిగ్రస్థుడి తుంపరల ద్వారా వ్యాపిస్తుంది
డి. వైరస్ సోకిన రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) బి, డి
- View Answer
- Answer: 4
41. పరాగ రేణువు, స్త్రీ బీజ కణాల స్థితులు వరుసగా?
1) ఏక స్థితిక, ద్వయ స్థితిక
2) ఏక స్థితిక, ఏక స్థితిక
3) ద్వయ స్థితిక, ఏక స్థితిక
4) ద్వయ స్థితిక, ద్వయ స్థితిక
- View Answer
- Answer: 2
42. ముత్యం లభించే జీవులకు సంబంధిం చిన వర్గం ఏది?
1) సీలెంటరేటా
2) ఎఖైనోడెర్మేటా
3) మొలస్కా
4) అనెలిడా
- View Answer
- Answer: 3
43. తేనెపట్టులోని మైనాన్ని తిని పట్టులోని గదులను నాశనం చేసే కీటకం ఏది?
1) వాక్స్ మాత్
2) లక్క కీటకం
3) నల్లి
4) ఈగ
- View Answer
- Answer: 1
44. బోంబెక్స్ మోరీ అనేది కిందివాటిలో ఏ జీవి శాస్త్రీయ నామం?
1) లక్క కీటకం
2) పట్టు పురుగు
3) తేనెటీగ
4) నల్లి
- View Answer
- Answer: 2
45. ‘రాగులు’ శాస్త్రీయ నామం ఏమిటి?
1) ట్రిటికమ్ వల్గేర్
2) జియా మేస్
3) సోర్గం వల్గేర్
4) ఎల్యూసిన్ కొరకానా
- View Answer
- Answer: 4
46. ‘హెన్ని’ అనేది ఏ రెండు జీవుల సంకరణ ఫలితం?
1) మగ గాడిద, ఆడ గాడిద
2) మగ గుర్రం, ఆడ గాడిద
3) మగ గాడిద, ఆడ గుర్రం
4) మగ గుర్రం, ఆడ గుర్రం
- View Answer
- Answer: 2
47. ‘కేంపర్’ ఏ మొక్క నుంచి లభిస్తుంది?
1) నల్ల మందు మొక్క
2) నక్స్ వామిక్
3) ఆసిమమ్ ఫాన్క్టమ్
4) సింకోనా అఫిసినాలిస్
- View Answer
- Answer: 3
48. కుడి కర్ణికా–జఠరికా రంధ్రం వద్ద ఉండే కవాటం ఏది?
1) అగ్ర ద్వయ కవాటం
2) పుపుస కవాటం
3) మిట్రల్ కవాటం
4) అగ్ర త్రయ కవాటం
- View Answer
- Answer: 4
49. కండరాల్లో జరిగే అవాయు శ్వాసక్రియ లో పైరువిక్ ఆమ్లం ఏవిధంగా మారుతుంది?
1) గ్లూకోస్
2) NADH
3) లాక్టిక్ ఆమ్లం
4) ATP
- View Answer
- Answer: 3
50. కండర సంకోచాలకు సంబంధించిన నాడులు ఏవి?
ఎ. జ్ఞాన నాడులు
బి. అభివాహి నాడులు
సి. చాలక నాడులు
డి. అపవాహి నాడులు
1) ఎ, బి
2) సి, డి
3) బి, సి
4) ఎ, డి
- View Answer
- Answer: 2
Tags
- TET DSC Biology Bitbank in Telugu
- Biology MCQ Quiz
- Biology Quiz in Telugu
- Biology Quiz
- DSC exams Quiz
- latest quiz
- Trending Quiz in Telugu
- TET Exam Quiz in telugu
- DSC latest quiz
- competitive exams bitbank
- competitive exams Quiz
- TET competitive Exam Quiz
- questions and answers
- Current Affairs Questions And Answers
- Bitbank
- social studies quiz in sakshi education
- Biology quiz questions and answers
- Biology Bit Bank syllabus and Preparation
- Biology bits in Telugu