Polity Material and Model Questions : భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
వివాదాలు – సుప్రీంకోర్టు తీర్పులు
రాజ్యాంగ సారాంశం మొత్తం ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది రాజ్యాంగంలో అంతర్భాగమా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి వర్సెస్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది. ఈ సందర్భంలో ప్రకరణ 143 ప్రకారం సలహా పూర్వక అభి్ర΄ాయాన్ని చెప్పింది. కానీ 1973లో కేశవానంద భారతి కేసులో తీర్పునిస్తూ దీనికి పూర్తి భిన్నంగా.. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా కేసులో కూడా అత్యున్నత ధర్మాసనం ఇదే అభి్ర΄ాయాన్ని పునరుద్ఘాటించింది.
రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికపై ఓటింగ్ నిర్వహించినప్పుడు కూడా ‘ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం’ అని డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది.
ప్రవేశిక ప్రయోజనం
ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, హృదయం. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ఇందులో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి.
ప్రయోజనాలు
➾ ఇది రాజ్యాంగ ఆధారాలను తెలుపుతుంది.
➾ రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది.
➾ రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది.
విమర్శ
➾ ప్రవేశికకు న్యాయ సంరక్షణ (Non-Justiciable) లేదు. ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలు పరచక΄ోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు.
➾ ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు.
➾ హక్కుల ప్రస్తావన లేదు.
➾ శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు.
➾ సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలు అమలుకు నోచుకోవట్లేదని చెప్పవచ్చు.
ప్రవేశిక – పరిశీలన
భారత రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా పరిగణిస్తున్న ప్రవేశిక ప్రాముఖ్యంపై భిన్న అభిప్రాయాలున్నాయి. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇందులో పొందుపర్చిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమల్లోకి రావు. వాటిని అమలుపరచాలని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. ఆ విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవు. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ ఆశయాలకు ఆచరణ లేదా అమలు చేయకపోవడం వల్ల వాటి సార్థకతపై తీవ్ర విమర్శ ఉంది. అయితే రాజ్యాంగంలోని ప్రకరణల భావం లేదా ఆచరణీయతపై సక్రమంగా వ్యాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి. ప్రవేశికకు స్వతంత్రంగా ప్రాముఖ్యం లేకపోయినా, ఇందులోని ఆదర్శాలను అమలు చేస్తూ పార్లమెంటు చట్టం చేసినప్పుడు లేదా ఆ విధంగా చేసిన చట్టాలను అమలు చేయనప్పుడు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.
☛ Join our Telegram Channel (Click Here)
ప్రవేశిక – సుప్రీంకోర్టు తీర్పులు వివాదం | సంవత్సరం | సుప్రీంకోర్టు తీర్పు సారాంశం |
ఎ.కె. గోపాలన్ కేసు | 1950 | ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రిస్తుంది. |
బెరుబారి వర్సెస్ యూనియన్ కేసు |
1960 | ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. |
గోలక్‌నాథ్ కేసు | 1967 | ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్ష్మ రూపం. |
కేశవానంద భారతి కేసు | 1973 | ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే. మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది. పరిమితంగా సవరించవచ్చు. |
ఎక్సెల్ వేర్ కేసు | 1979 | సామ్యవాదం పద నిర్వచనం. |
నకారా కేసు | 1983 | సామ్యవాదం అనేది గాంధీయిజం, మార్క్సిజం కలయిక. |
ఎస్.ఆర్.బొమ్మాయ్ కేసు | 1994 | లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది. |
ఎల్.ఐ.సి. ఆఫ్ ఇండియా | 1995 | ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని పునరుద్ఘాటించింది. |
అశోక్‌కుమార్ గుప్తా కేసు | 1997 | సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు. |
అరుణా రాయ్ కేసు | 2002 | విద్యా సంస్థల్లో మత విలువల బోధన లౌకికతత్వానికి వ్యతిరేకం కాదు. |
ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు
➾ ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం (Political Horoscope) –కె.యం. మున్షీ
➾ రాజ్యాంగంలో ప్రవేశిక అత్యంత పవిత్ర మైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ. రాజ్యాంగానికి తాళంచెవి లాంటిది. – పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ
➾ రాజ్యాంగానికి ప్రవేశిక ఒక గుర్తింపు పత్రం లాంటిది. – ఎం.ఎ. నాని ΄ాల్కీవాలా
➾ రాజ్యాంగానికి ప్రవేశిక కీలక సూచిక లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా ΄ాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను.
– సర్ ఎర్నస్ట్ బార్కర్
➾ ప్రవేశిక మన కలలు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం.
– అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
➾ భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటన మాదిరిగానే రాజ్యాంగ ఆత్మ. రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు.
– జస్టిస్ హిదయతుల్లా
➾ ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ. – నెహ్రూ
➾ రాజ్యాంగ ప్రాధాన్యాల లక్షణ సారం ప్రవేశిక. – మథోల్కర్
➾ ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళంచెవి లాంటిది. – జె. డయ్యర్
➾ ప్రవేశిక రాజ్యాంగానికి ఆధారం కాదు, అలాగే పరిమితి కాదు. – సుప్రీంకోర్టు
☛ Join our WhatsApp Channel (Click Here)
కమిటీలు – వివరాలు
కమిటీ | అధ్యక్షుడు/ చైర్మన్ | పరిశీలన అంశం |
మోహన్ కమిటీ | జస్టిస్ మోహన్ | ప్రభుత్వరంగ సంస్థల స్థితిగతులపై |
ఎంపీ లాడ్స్ కమిటీ | వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ | ఎంపీలాడ్స్ అవకతవకల విచారణకు |
ముఖర్జీ కమిటీ | ముఖర్జీ | కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి |
మల్హోత్రా కమిటీ | ఆర్.ఎస్. మల్హోత్రా | బీమారంగ సంస్కరణల సమీక్ష కోసం |
లింగ్డో కమిటీ | జేఎం లింగ్డో | విద్యార్థి సంఘాల ఎన్నికల సక్రమ నిర్వహణకు సంబంధించింది |
గతంలో అడిగిన ప్రశ్నలు
1. ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగకర్తలు ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
ఎ) యు.ఎస్.ఎ. బి) యు.కె.
సి) యు.ఎస్.ఎస్.ఆర్. డి) జర్మనీ
2. భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
ఎ) ఫ్రెంచి రాజ్యాంగం
బి) జర్మనీ రాజ్యాంగం
సి) యు.ఎస్. రాజ్యాంగం
డి) యు.కె. రాజ్యాంగం
3. రాజ్యాన్ని మతం నుంచి వేరు చేయడాన్ని ఏమంటారు?
ఎ) నాస్తికవాదం బి) సామ్యవాదం
సి) లౌకికవాదం డి) సాంఘికన్యాయం
4. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది?
ఎ) ప్రజలు బి) రాజ్యాంగం
సి) పార్లమెంటు డి) పత్రికలు
సమాధానాలు
1) ఎ; 2) ఎ; 3) సి; 4) బి.
☛ Follow our Instagram Page (Click Here)
మాదిరి ప్రశ్నలు
1. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం అని, అదేవిధంగా కాదనీ పరస్పర వివాదాస్పదమైన తీర్పులను సుప్రీంకోర్టు ఏయే కేసుల్లో వ్యక్తీకరించింది?
ఎ) ఎ.కె.గోపాలన్, గోలక్‌నాథ్
బి) కేశవానంద భారతి, గోలక్‌నాథ్
సి) మేనకాగాంధీ, మినర్వా మిల్స్
డి) పైవేవీ కాదు
2. ప్రవేశిక నుంచి ఏం రాబట్టవచ్చు?
ఎ) రాజ్యాంగానికి ఆధారం
బి) రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు
సి) ప్రభుత్వ స్వరూపం
డి) పైవన్నీ
3. సమగ్రత అనే పదజాలాన్ని ప్రవేశికలోకి చేర్చడానికి కారణం?
ఎ) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం
బి) వేర్పాటువాద ఉద్యమాలు
సి) సుప్రీంకోర్టు తీర్పులు
డి) ఎ, సి
4. ప్రవేశికలో సమకాలీన ప్రాముఖ్యతను, వివాదాన్ని సంతరించుకున్న పదాలు?
ఎ) లౌకికతత్వం, సామ్యవాదం
బి) ఐక్యత, సమగ్రత
సి) గణతంత్రం, సార్వభౌమాధికారం
డి) పైవన్నీ
5. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన పదాలేవి?
ఎ) సామ్యవాద, లౌకిక
బి) ప్రజాస్వామిక
సి) సార్వభౌమ
డి) రిపబ్లిక్
6. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావనను ఎక్కడ ΄÷ందుపరిచారు?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) పీఠిక
సి) రాజ్య విధానం – ఆదేశిక సూత్రాలు
డి) నాలుగో షెడ్యూల్
7. కింది వాటిలో భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు?
i) దృఢ రాజ్యాంగం
ii) ద్విసభా విధానం
iii) సి.ఎ.జి. కార్యాలయం
iv) సమష్టి బాధ్యత
ఎ) i, ii, iii బి) i, iv
సి) i, ii, iii, iv డి) i, ii
8. ‘రాజ్యాంగానికి ప్రవేశిక ఒక గుర్తింపు పత్రం లాంటిది’ అని పేర్కొన్నవారు?
ఎ) జస్టిస్ హిదయతుల్లా
బి) అంబేద్కర్
సి) మహాత్మాగాంధీ
డి) ఎం.ఎ. నాని పాల్కీవాలా
9. ప్రవేశిక–గ్రహించిన అంశాలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత?
ఎ) ప్రజాస్వామ్యం – అమెరికా
బి) గణతంత్రం – ఫ్రాన్స్
సి) సామ్యవాదం – రష్యా
డి) లౌకిక – బ్రిటన్
10. సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పునిచ్చింది?
ఎ) కేశవానంద భారతి కేసు
బి) బెరుబారి వర్సెస్ యూనియన్ కేసు
సి) ఎస్.ఆర్. బొమ్మాయ్ కేసు
డి) మినర్వా మిల్స్ కేసు
☛Follow our YouTube Channel (Click Here)
సమాధానాలు
1) బి; 2) డి; 3) బి; 4) ఎ; 5) ఎ;
6) సి; 7) డి; 8) డి; 9) డి; 10) బి.
Tags
- polity material with model questions
- competitive exams for govt jobs
- appsc and tspsc groups exams
- polity material appsc
- previous and preparatory questions for groups exams
- bit banks for polity in telugu
- model questions for polity in groups exams
- appsc polity material
- appsc and tspsc polity material in telugu
- tspsc polity material in telugu
- Education News
- Sakshi Education News
- polity material and model questions