Navodaya Admissions : నవోదయలో 9వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు..

చిత్తూరు: అన్నమయ్య జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి అడ్మిషన్లకు అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపల్ వేలాయుధన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 2025–26 విద్యా సంవత్సరానికి 9వ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో చదువుతూ 2010 మే 1వ తేదీ నుంచి 2012 జులై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదువుతూ 2008 జూన్ 1వ తేదీ నుంచి 2010 జులై 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నివాసం జిల్లా పరిధిలోనే ఉండాలన్నారు.
Spot Admissions: ఈనెల 7 నుంచి డిగ్రీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న బాల, బాలికలు www. navodaya.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 9, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 8వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Department of Women and Child Welfare : మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీలు
Tags
- Navodaya Vidyalaya schools
- admissions
- ninth and intermediate
- School admissions
- entrance exams for ninth and inter admissions
- applications for navodaya admissions
- Government school students
- online applications
- Admissions 2025
- Tenth Students
- Ninth Class Admissions
- students education
- Education News
- Sakshi Education News
- JawaharNavodayaVidyalaya
- 9thClassAdmissions
- EntranceExam2025
- AnnamaiyaDistrict
- SchoolAdmissions
- AcademicYear2025
- EligibilityCriteria
- ChittoorDistrict
- EducationAnnouncements
- SchoolAdmissionsCriteria
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024