Bank Holidays for 2 Days: బ్రేకింగ్‌న్యూస్.. రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కారణమిదే
Sakshi Education
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూత పడనున్నాయి. మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) తెలిపింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలు ఆగిపోనున్నాయి.
Bank Holidays for 2 Days News In Telugu
ఐబీఏతో జరిగిన సమావేశాల్లో యూఎఫ్‌బీయూ సభ్యులందరూ అన్ని కేడర్లలో నియామకాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు వంటి అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేబర్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లతో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్‌బీయూ గతంలో సమ్మెకు పిలుపునిచ్చింది.