రాయచోటి(జగదాంబ సెంటర్): రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నవంబర్ 1న జిల్లా స్థాయి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నాగార్జున, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.శివశంకర్ తెలిపారు.
Job Mela
ఐసీఐసీఐ బ్యాంకు, ముత్తూట్ ఫైనాన్స్, టీవీఎస్ ఇండియా లిమిటెడ్, యంగ్ ఇండియా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పది, ఇంటర్, డిప్లొమో, ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులన్నారు.
ఉద్యోగాలకు ఎంపికై న వారికి రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని వారు కోరారు.
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
ఎప్పుడు: నవంబర్ 01 ఎక్కడ: రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల