Skip to main content

Free Job Vacancies Information: ‘డీట్‌’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!.. ఉచితంగా ఉద్యోగ ఖాళీల సమాచారం.. రిజిస్ట్రేషన్‌ చేసుకోండి ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల దరికి చేర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్‌ పోర్టల్‌/ యాప్‌ ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌‌ ఆఫ్‌ తెలంగాణ’ (డీట్‌)ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విస్తృతపరి చింది.
Free Job Vacancies Information  AI-based job portal DEET promoting employment in Telangana  Digital Employment Exchange of Telangana app expansion

ఇప్పటివరకు కార్మిక, ఉపాధి కల్పన విభాగంతో ‘డీట్‌’ కలిసి పనిచేస్తుండగా ఇకపై పరిశ్రమలు, వాణిజ్య శాఖతోనూ అనుసంధానం కానుంది. గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్‌ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కింద రిజిస్టర్‌ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ తెలిపింది. ఇటీవలే ‘డీట్‌’ కొత్త లోగోను ప్రభుత్వం ఆవిష్కరించడం తెలిసిందే.

చదవండి: JK Bank Recruitment: జమ్మూకశ్మీర్‌ బ్యాంక్‌లో 278 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.10,500 జీతం..

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సమాచారం కూడా.. 

ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ‘డీట్‌’లో లభిస్తుంది.

ఉద్యోగ ఖాళీలు, ఇంటర్వ్యూ తేదీలు, ఇతర సమాచారం దీనిద్వారా లభి స్తుంది. ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ, చేరిక, నియామకపత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియంతా ఈ యాప్‌ ద్వారా జరుగుతుంది.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా.. 

  • నిరుద్యోగులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డీట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • పేరు, మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీ, తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • యాప్‌లోకి లాగిన్‌ అయ్యాక ఉద్యోగాలను అన్వేషిస్తూ విద్యార్థతలకు తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు. 
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

13735 Jobs for SBI: ఎస్‌బీఐలో 13,735 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివ‌రాలు ఇలా..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. జూనియర్‌ అసోసియేట్‌(క్లర్క్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2024 నాటికి 20 ఏళ్ల  నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష), స్థానిక భాష పరీక్ష ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభతేది: 17.12.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.01.2025
వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers/current-openings

Published date : 31 Dec 2024 12:21PM

Photo Stories