Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
పార్వతీపురంటౌన్: సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 5న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 ఏళ్ల వయస్సుగల యువత జాబ్ మేళాకు అర్హులన్నారు. 10, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదువుతున్న యువతకు 25 కంపేనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.
Job Mela For Freshers
ఆసక్తి గల యువత హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసి రిఫరెన్సు నంబర్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్సులతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్: 94947 77553, 73825 59022 నంబర్లను సంప్రదించాలన్నారు.