Skip to main content

Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!

సత్తెనపల్లి: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌, సీడాప్‌ అధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈనెల 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్‌మేళా జరుగు తుందని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజిరావు శుక్రవారం తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంత యువత జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని వివరించారు.
Job fair  in Palnadu district   Job Mela For Freshers  Sattenapalli job fair announcement   AP State Skill Development Corporation job fair  Employment opportunities for youth in Sattenapalli
Job Mela For Freshers

మేళాలో సుమారు 4 కంపెనీలు పాల్గొంటున్నాయని, ఉదాహరణకు ఐ ప్రాసెస్‌ సర్వీసెస్‌–ఐసీఐసీఐ బ్యాంక్‌, అపెక్స్‌ సోల్యూషన్స్‌ లిమిటెడ్‌, ఆక్సిస్‌ బ్యాంక్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయన్నారు. జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు రూ.11 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉండవచ్చన్నారు.

ఈ జాబ్‌ డ్రైవ్‌కు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విభాగాల వరకు చదువుకున్న 18–38 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువత వారి బయోడేటా లేదా రెస్యూమ్‌, ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌, ఆధార్‌ నకలు, పాస్‌పోర్ట్‌ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

Free tailoring training for women: మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ

ఇతర వివరాలకు రామకృష్ణరెడ్డి– 80743 93466, అంజిరెడ్డి – 9494986164 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఔత్సాహిక యువత ముందుగా htt pr:// nai punya-m.a p.g-ov.i n/ అనే వెబ్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

ఎప్పుడు: జనవరి 6న
ఎక్కడ: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో

Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

విద్యార్హత: టెన్త్‌ ఇంటర్‌ ఐటీఐ డిప్లొమా బీటెక్‌ ఫార్మసీ పీజీ
వయస్సు: 18-38 ఏళ్లకు మించకూడదు

వివరాలకు: 8074393466,9494986164.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 04 Jan 2025 03:17PM

Photo Stories