Skip to main content

Free Training For Youth: మగ్గం,జూట్‌ బ్యాగ్స్‌ తయారీలో ఉచితంగా శిక్షణ.. భోజనం, వసతి సౌకర్యం కూడా..

కొరిటెపాడు(గుంటూరు): యూని యన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 17వ తేదీ నుంచి జూట్‌ బ్యాగ్స్‌ తయారీ, 22వ తేదీ నుంచి మగ్గం వర్క్స్‌ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సంస్థ డైరెక్టర్‌ జి.బి.కుమార్‌  ఒక ప్రకటనలో తెలిపారు. 19 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.
Free Training For Youth  Free Jute Bag Making Training at Union Bank of India Rural Self-Employment Training Institute  Maggam Works Training Course at Union Bank of India Rural Self-Employment Training Institute
Free Training For Youth

జూట్‌ బ్యాగ్స్‌ తయారీ 13 రోజులు, మగ్గం వర్క్స్‌ తయారీపై 30 రోజులు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఓల్డ్‌ బ్యాంక్‌ వీధి, కొత్తపేట, గుంటూరు చిరునామాలో సంప్రదించాలని సూచించారు.

Mega Job Mela For Freshers: 919 పోస్టులు.. నెలకు రూ. 30వేల జీతం, పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

0863 – 233 6912, 97006 87696, 81253 97953, 99499 30155 ఫోను నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసు కోవాలని కోరారు. ఈ అవకాశాన్ని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.


ముఖ్య సమాచారం:

మర్గం వర్క్స్‌, జూట్‌ బ్యాగ్స్‌ తయారీలో ఉచిత శిక్షణ

వయస్సు: 19-45 ఏళ్లకు మించకూడదు
ఫీజు: పూర్తి ఉచితంగా.. భోజన, వసతి సౌకర్యం సైతం

Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!

కావల్సినవి: ఆధార్‌, తెల్ల రేషన్‌ కార్డు జిరాక్స్‌లు, నాలుగు ఫోటోలు
వివరాలకు:  97006 87696, 81253 97953, 99499 30155 సంప్రదించండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 04 Jan 2025 03:51PM

Photo Stories