Free tailoring training for women: మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ
Sakshi Education
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ టైలరింగ్‌లో ఈనెల 16 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ కె.పుష్పక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు ఉండి చదవడం, రాయడం వచ్చినవారు అర్హులన్నారు.
శిక్షణలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుదన్నారు. నాలుగు ఫొటోలు, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో కల్లూరు తహసీల్దారు కార్యాలయం పక్కన ఉన్న కెనరా బ్యాంకు హౌసింగ్ బోర్డు బ్రాంచ్‌లో సంప్రదించాలన్నారు. మరిన్న వివరాలకు 63044 91236 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
ముఖ్య సమాచారం:
ట్రైనింగ్: ఉచితంగా
వయస్సు: 18-45 ఏళ్లలోపు
Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కావల్సిన సర్టిఫికేట్స్: ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాళా, ఇతర విద్యార్హత ధ్రువపత్రాలు
మరిన్ని వివరాలకు: 63044 91236 నంబర్‌కు సంప్రదించండి
Published date : 03 Jan 2025 10:25AM
Tags
- Free Training Courses
- Free training in tailoring Free Food and accommodation
- free tailoring machine
- Tailoring skills training
- Free Tailoring training program
- Self Employed Womens Free training
- Free training
- free training for ladies
- Employment skills
- Employment Skills Courses
- Rural self-employment
- Skill Development
- Free Tailoring Training