Inter Board : ఇంటర్ విద్యార్థుల నైపుణ్యాలకు బోర్డు ప్రత్యేక చర్యలు.. ఈసారి కూడా..
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంచేందుకు బోర్డు ఒక కీలక చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా గతేడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు విజయవంతంగా ప్రాక్టికల్స్‌ను నిర్వహించారు. దీంతో విద్యార్థుల్లో ఆంగ్ల భాషలో నైపుణ్యం మెరుగుపడింది. విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలు రావడంతో ఈ విద్యా సంవత్సరం ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా ఆంగ్లంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.
భాషా నైపుణ్యాలను పెంచేందుకు...
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారు. అనంతరం ఇంటర్‌కు వెళ్లిన తర్వాత ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించే క్రమంలో ఆంగ్లంలో సరైనా భాష నైపుణ్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు, ఆంగ్లంలో భాష నైపుణ్యాలను పెంపొందించిందుకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ న్విహిచింది. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులను కేటాయించింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ప్రాక్టికల్స్‌తో విద్యార్థుల్లో ఆంగ్ల భాషలో నైపుణ్యాలు మెరుగుపడినట్లు ఇంగ్లిష్ అధ్యిపకులు పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణ ఇలా...
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఆంగ్లంలో ప్రాక్టికల్స్ నాలుగు విభాగాలలో నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు కమ్యూనికేషన్ ఫంక్షన్, జస్ట్ ఎ మినిట్, రోల్ ప్లే, లిజనింగ్ కాంప్రహెన్సివ్ తదితర అంశాలపై ప్రశ్నలు రూపొందిస్తుంది. రెండో సంవత్సరంలో డిస్క్రైబింగ్ ఏ టాపిక్, ప్రజెంటేషన్ స్కిల్, గ్రూప్ డిస్కషన్, లిజనింగ్ కాంప్రహెన్సివ్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. నాలుగు విభాగాలలో ఒక్కో విభాగానికి 4 మార్కులు అలా నాలుగు విభాగాలకు 16 మార్కులు కేటాయించగా మిగిలిన 4 మార్కులు విద్యార్థులు రాసే రికార్డు కేటాయించారు. ఇలా మొత్తం 20 మార్కులు ఆంగ్లం ప్రాక్టికల్‌కు కేటాయించారు.
వెలువడిన షెడ్యూల్...
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఆంగ్లంలో ప్రాక్టికల్స్ నిర్వహించే తేదీలను ఇంటర్ బోర్డు ఇదివరకే ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 31న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆంగ్లం ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు.
పూర్తి అయిన సిలబస్..
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఆంగ్లంలో నిర్వహించే ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లు ఇదివరకే పూర్తి అయ్యాయని జిల్లాలోని ఆయా జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు అంటున్నారు. సిలబస్‌లు పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే ఆంగ్లం ప్రాక్టికల్ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేశామని, విద్యార్థులు రికార్డులను కూడా రాయడం పూర్తయిందని ఆంగ్ల అధ్యాపకులు తెలిపారు.
భాషా నైపుణ్యాలు మెరుగు..
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆంగ్లం ప్రాక్టికల్స్‌తో విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. మొదటి సంవత్సరంలో ఆంగ్లంలో ప్రాక్టికల్ నిర్వహించడంతో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు మెరుగయ్యాయి. రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌తో మరింత మెరుగు కానున్నాయి.
- సురేశ్, ఆంగ్ల అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల
బోర్డు నిర్ణయం మేరకు
ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటున్నాం. గత సంవత్సరం మొదటి సంవత్సరం, ఈసారి రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా ఆంగ్లం ప్రాక్టికల్స్ నిర్వహించాలని బోర్డు సూచించింది. ఇందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- పరశురామ్ నాయక్, జిల్లా నోడల్ అధికారి
జిల్లాలో విద్యార్థుల సంఖ్య
ఇంటర్ ఫస్ట్ ఇయర్ 7,037
ఇంటర్ సెకండియర్ 6,706
మొత్తం విద్యార్థులు 13,743
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- inter students
- Practical Exams
- Inter Practicals
- students education
- Skill Development
- english skills
- English Practicals
- intermediate practical exams
- Intermediate Board
- students skills in english
- practical exams in english for inter students
- Inter First Year
- new academic year
- number of intermediate students
- Telangana inter board
- Telangana Government
- education department in telangana state
- Government and Private Colleges
- Telugu Medium
- english practicals in telangana inter college
- students exams in intermediate
- Rural Students
- government schools and colleges
- english skills for students
- intermediate second year
- Education News
- Sakshi Education News
- EnglishLanguageSkills
- InterBoard updates
- EnglishPracticalsexams
- IntermediateEducation
- FirstYearInter
- SecondYearInter
- EducationImprovement
- LanguageProficiency
- AcademicYear2025
- PracticalExams