Skip to main content

Inter Board Exams Hall Tickets : ఇంట‌ర్ విద్యార్థుల‌కు బోర్డు అల‌ర్ట్‌.. ఫోన్‌కే హాల్‌టికెట్లు..!!

సాధారణంగా బోర్డు ప‌రీక్ష‌ల‌కు కాలేజీల్లో లేదా అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు.
AP inter board exams 2025 hall tickets to students whatsapp number

సాక్షి ఎడ్యుకేష‌న్: సాధారణంగా బోర్డు ప‌రీక్ష‌ల‌కు కాలేజీల్లో లేదా అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. కాని ఈసారి ఇంట‌ర్ విద్యార్థుల వ‌ద్ద‌కే స్వ‌యంగా వ‌స్తుంది. అదేలా అంటారా..! ఈ సారి బోర్డు ప‌రీక్ష‌ల‌కు అధికారులు చిన్న మార్పును ప్ర‌క‌టించారు. ప్ర‌తీ సారి విద్యార్థుల కాలేజీల‌కు, లేదా ఆన్‌లైన్‌లో వారి ప‌రీక్ష‌ల‌కు సంబంధిచిన హాల్‌టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. కాని, ఈసారి విద్యార్థుల సెల్‌ఫోన్‌కే నేరుగా వెళ్తుంది.

AP Intermediate Exams 2025 News: నేటితో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

వాట్స‌ప్‌కే..

ఏపీ ఇంట‌ర్ విద్యార్థుల‌కు బోర్డు అల‌ర్ట్ తెలిపింది. విద్యార్థుల వాట్సప్ నంబ‌ర్‌కు వారి హాల్‌టికెట్లు చేర‌నున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. కాగా, వారి నంబ‌ర్‌కు హాల్‌టికెట్ల‌కు సంబంధించిన లింక్ వ‌స్తుంది. ఆ లింక్‌తో విద్యార్థులు వారి హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

AP Inter 2nd Year 2025 Time Table: ఇంటర్‌ 2nd ఇయర్‌ పరీక్షల టైం-టేబుల్‌ విడుదల..సబ్జెక్టుల వారీగా మెటీరియల్స్‌ ఇవే

స‌ర్కార్ నిర్ణ‌యం..

కొంద‌రు ఇంటర్ విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు హాల్ టికెట్లు నిలిపివేయడం వంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాల్‌ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా విద్యార్థులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Feb 2025 10:42AM

Photo Stories