Skip to main content

Intermediate Practical Exams : ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా... 144 సెక్షన్‌!

పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందుల‌కు గురికాకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్య శెట్టి.
Intermediate practical exams for vocational and regular students

కర్నూలు సిటీ: నేడు ప్రారంభమైన‌ ఇంటర్మీయెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో పొరపాట్లకు తావ్వివొద్దని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్య శెట్టి, జిల్లా వృత్తి విద్యాధికారి వై.పరమేశ్వరరెడ్డి స్ప‌ష్టం చేశారు. మంగళవారం స్థానిక టౌన్‌మోడల్‌ జూనియర్‌ కాలేజీలో ప్రాక్టికల్‌ పరీక్షలపై సైన్స్‌ లెక్చరర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు అవగాహస సదస్సు నిర్వహించగా.. బుధవారం అంటే, నేటి నుంచి ఒకేషనల్‌ విద్యార్థులకు, ఈ నెల 10వ తేదీ నుంచి జనరల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయన్నారు.

Anganwadi Child Request : అంగ‌న్వాడి చిన్నారి విజ్ఞ‌ప్తి.. స్పందించిన మంత్రి..

పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందుల‌కు గురికాకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష జరిగే రోజున ప్రశ్నా పత్రం గంట ముందుగానే ఇన్విజిలేటర్లకు వెబ్‌సైట్‌ ద్వారా పంపుతామని, అర గంట ముందుగా దానిని డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు అందజేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, అలాగే కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ లాలెప్ప, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు నాగభూషణ రెడ్డి, యు.పద్మావతి, జీఎస్‌ సురేష్‌ చంద్ర, ప్రిన్సిపాల్‌ సుంకన్న, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీ, తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Feb 2025 10:25AM

Photo Stories