Skip to main content

Special Focus and Guidelines for Inter Exams : ఇంట‌ర్ విద్యార్థుల‌పై ప్ర‌త్యేక దృష్టి.. అధ్యాప‌కులు ఇవి త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి..

ఇంట‌ర్ విద్యార్థుల‌కు బోర్డు ప‌రీక్ష‌లు చాలా ద‌గ్గ‌రిలో ఉన్నాయి. వారికి కనీసం రెండు నెల‌ల కూడా పూర్తిగా లేవు.
Inter board announces guidelines for final exams   preparation tips for interexams

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంట‌ర్ విద్యార్థుల‌కు బోర్డు ప‌రీక్ష‌లు చాలా ద‌గ్గ‌రిలో ఉన్నాయి. వారికి కనీసం రెండు నెల‌ల కూడా పూర్తిగా లేవు. కాబట్టి, తెలంగాణ ఇంట‌ర్ బోర్డు.. విద్యార్థుల‌కు, అధ్యాప‌కుల‌కు, ప్రిన్సిపాళ్ల‌కు, త‌ల్లిదండ్రుల‌కు త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు, ప‌లు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరాకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Inter Board Exam Fees : ఇంట‌ర్ బోర్డు ఎగ్జామ్ ఫీజు చెల్లింపుకు గ‌డువు పెంపు.. ఆల‌స్య రుసుంతో..

గతేడాది ఉత్తీర్ణత శాతం 50కి మించలేదు. 2023 ఇంటర్ ఫస్టియర్ లో 40 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. గత మూడేళ్లుగా చూసినా ప్రభుత్వ కాలేజీల్లో సగటు ఉత్తీర్ణత శాతం 45 శాతానికి మించడం లేదు. ఈ ప‌రిస్థితి ఈసారి రిపీట్ కావొద్ద‌ని మ‌రిన్ని చ‌ర్య‌లు చేప‌ట్టి అయినా విద్యార్థుల‌ను ప్రోత్సాహించి, వారి ఉత్తీర్ణ‌త శాతం పెంచాల‌ని కొన్ని సూచ‌న‌లు, ఆదేశాల‌ను జారీ చేసింది ఇంట‌ర్ బోర్డు.

- ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలో క‌ళాశాల‌లో విద్యార్థుల హాజ‌రు శాతంపై అధ్యాప‌కులు, ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలి. గతంలో విద్యార్థుల గైర్హాజ‌రు శాతమే ఎక్కువైంది. దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి.

- ప్రత్యేక తరగతుల చేప‌ట్టాలి. అధ్యాపకుల సెలవులు కూడా త‌గ్గాలి. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో బోర్డు అధికారుల అనుమ‌తి తీసుకోవాలి.

- వారానికి ఒక రివిజ‌న్ టెస్ట్ పెట్టాలి. దీంతో, విద్యార్థులు లోపం ఎక్క‌డ ఉంది అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఉంటుంది.

- ముఖ్యంగా కాలేజీల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి తగ్గకుండా జాగ్రత్త తీసుకోవాలని స్పష్టం చేసింది. విద్యార్థులు ప్ర‌తీ త‌ర‌గ‌తికి హాజ‌రై ఉండాల‌ని ఆదేశించింది.

Inter Board: స్పెషల్‌ క్లాసులు.. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక కార్యాచరణ

- వెన‌క‌బ‌డిన విద్యార్థుల‌కు ప్రోత్సాహం అందించాల‌ని, ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని, వారిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని సూచించింది.

- విద్యార్థులు గైర్హాజరైతే కాలేజీ ప్రిన్సిపాల్స్ బాధ్యత తీసుకోవాలని సూచించింది. విద్యార్థులు రెగ్యులర్ గా కాలేజీలకు రాకుండా ఉంటే తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలని ప్రిన్సిపాల్ లకు బోర్డు సూచించింది.

- విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు కూడా ప్ర‌త్యేకంగా పిలిపించి, విద్యార్థుల చ‌దువు గురించి వివ‌రించి, వారిని ప్రత్యేక దృష్టిని పెట్ట‌మ‌ని తెలియ‌జేయాలి.

ఉపాధ్యాయులకు ప్ర‌త్యేక‌ సూచ‌న‌లు..

- విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించి, విద్యార్థుల చ‌దువు త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకోవాలి.

- వెన‌క‌బ‌డిన విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి. వారికి ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల‌ను ఏర్పాటు చేయాలి.

- ప్ర‌తీ విద్యార్థికి ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యే వ‌ర‌కు ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల‌ను ఏర్పాటు చేసి, వారికి ప్రోత్సాహం అందించాలి. వెన‌క‌బ‌డిని స‌బ్జెక్టుపై వారికి అవ‌గాహ‌న క‌ల్పించాలి.

Board of Intermediate Exams 2025 Fee: ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం..తేదీలు ఇవే..

- మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని ప్రోత్సాహించాలి.

- థియ‌రీలోనే కాకుండా, ప్రాక్టిక‌ల్స్‌లో కూడా విద్యార్థుల‌కు ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు నిర్వ‌హించి, వారికి అన్ని విష‌యాలు స్ప‌ష్టంగా అర్థ‌మైయ్యేలా నేర్పించాలి. 

- మ‌రీ ముఖ్యంగా విద్యార్థులు హాజ‌రు శాతం పెర‌గాలి.

- ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల్లో కేవ‌లం పాఠాలు చెప్ప‌డమే కాకుండా విద్యార్థుల‌కు చ‌దువుపై దృష్టి మాత్ర‌మే కాకుండా ఆరోగ్య విష‌యాల‌పై కూడా అవ‌గాహ‌న క‌ల్పించాలి. వారితో కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. చ‌దువు త‌ర‌గ‌తులు ప్రారంభించే ముందు ఇలా చేయిస్తే వారికి కూడా చ‌దువుపై శ్ర‌ద్ధ ఉంటుంది. ఇష్టంగా చ‌ద‌వ‌గ‌ల‌రు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Jan 2025 09:36AM

Photo Stories