Skip to main content

Mega DSC Application Errors : మెగా డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల్లో సాంకేతిక‌ ఇబ్బందులు.. అభ్య‌ర్థుల ఆవేద‌న‌

రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపా­ధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థు­లకు చుక్క­లు చూపిస్తోంది.
Technical errors in applications of ap mega dsc 2025   DSC 2024 online form submission issue

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపా­ధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థు­లకు చుక్క­లు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకో­వ­డానికి వెబ్‌సైట్‌­ను ఓపెన్‌ చేసిన నిరుద్యోగ ఉపా­ధ్యాయ అభ్య­ర్థులకు సాంకేతిక సమ­స్యలు ఎదు­రవుతు­న్నాయి. ఇప్పటికే కొన్ని నిబంధనలు అడ్డంకి కాగా, ఆన్‌లైన్‌లోనూ సాంకేతిక కార­ణా­లతో దరఖా­స్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతు­న్నాయి. హెల్ప్‌ లైన్‌ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని అభ్యర్థు­లు వాపోతు­న్నారు. కఠిన నియ­­మాలతో నిరుద్యో­గులు ఇబ్బందు­లు పడు­తు­న్నారు. 

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఆన్‌లైన్‌­లో దరఖాస్తు చేసు­కుంటున్న అభ్యర్థుల­కు పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో కూడా కనీస మార్కులు 45–­50 శాతం లేకుంటే ఇన్‌ వ్యాలి­డ్‌గా చూపి­స్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యా­ర్హత అయిన డిగ్రీలో సగటు మా­ర్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దర­ఖాస్తు సబ్మిట్‌ అవ్వడం లేదు. ఓపెన్‌లో ఇంటర్మీడియట్‌ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతు­న్నా­రు.

ఐఐటీల్లో బీటెక్‌ సీట్లు పెరుగుతున్నాయ్.. కొత్త కోర్సులకు సిద్ధమవుతున్న కేంద్ర విద్యా సంస్థలు!

ఉ­దా­హ­ర­ణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడి­యట్‌లో అరబిక్‌ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్‌లో రెండవ భాష సెలెక్ట్‌ చెస్తే డ్రాప్‌–డౌన్‌ మెనూలో అరబిక్‌ ఆప్షన్‌ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్‌ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్‌ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్‌ ఇవ్వలేదు.

డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్‌ ఆప్షన్‌ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతు­న్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలి

మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్య­ర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యో­గులు డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్‌ చేశారు. దీంతో హాల్‌ టికెట్‌ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్‌ చేసుకునే అవకాశం ఇవ్వా­లని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Social Media Users : సోష‌ల్ మీడియాకు బానిస‌లుగా చిన్నారు.. ఆరోగ్యంపై ప్ర‌భావం.. ఇప్పటికే 10ల‌క్ష‌లకుపైగా..

పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?

» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్య­ర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యో­గా­లకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు.
»    ఎస్‌జీటీకి ఇంటర్మీడియట్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్‌ అభ్య­ర్థు­లకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకు­న్నట్లు సమాచా­రం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు.

JEE Advanced Preparation Tips: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025లో టాప్ ర్యాంక్ సాధించాలా? ప్రిపరేషన్ టిప్స్ ఇవే!

»    పీజీ ఇంగ్లిష్‌లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మా­ర్కులున్న ఓ జనరల్‌ అభ్యర్థి దర­ఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తు­న్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూ­స్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.
»   టెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కు­లతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్‌ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Apr 2025 01:44PM

Photo Stories