Skip to main content

Mega Job Mela: మెగా ఫారిన్‌ జాబ్‌ మేళా..వివిధ దేశాల్లో భారీ జీతాలతో..

హుస్నాబాద్‌: అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేలా నవంబర్‌ రెండో వారంలో హుస్నాబాద్‌లో మెగా ఫారిన్‌ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మంత్రి ఛాంబర్‌లో టాంకాం కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌ నియోజవర్గంలోని నిరుద్యోగ యువత ఫారిన్‌ జాబ్‌ మేళాకు పేరు నమోదు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. 
Mega Job Mela

ఆనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా ఫారిన్‌ జాబ్‌ మేళాను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. జాబ్‌ మేళా కోసం మండలాల్లో అవగాహన కల్పించాలని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత డేటా సేకరించి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించాలని సూచించారు.

Job Mela: రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా

mega job mela

ఇప్పటికే హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు మంచి స్పందన వచ్చిందని, దాని ద్వారా 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. సమావేశంలో స్పెషల్‌ సెక్రటరీ ఇండస్ట్రీస్‌ టాంకాం సీఈఓ విష్ణువర్ధన్‌రెడ్డి, టాంకాం జీఎం నాగ భారతి, మేనేజర్‌ షబ్నా, అధికారులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Oct 2024 05:24PM

Photo Stories