Skip to main content

Job Mela: 40కి పైగా కంపెనీల్లో ఉద్యోగాలు.. రేపే జాబ్‌మేళా

Job Mela  Job fair at AB function hall in Mahabubabad  Mahabubabad Mega Job Mela
Job Mela

మహబూబాబాద్‌ రూరల్‌ : పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ మంగళవారం నిర్వహించే మెగా జాబ్‌ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్‌ హాల్‌లో త్రెడ్జ్‌ ఐటీ గ్రూమింగ్‌ ఎక్సలెన్స్‌ వారి సౌజన్యంతో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 10వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

ఈ మెగా జాబ్‌మేళాలో సుమారు 40 కంపెనీలకుపైగా పాల్గొంటున్నాయని, కనీస వేతనం రూ.12 వేల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్‌, డిప్లమో, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌ అండ్‌ ఫార్మసీ మొదలగు విద్యార్హత కలిగిన యువత మేళాలో పాల్గొనాలని సూచించారు.

KGBV Jobs: కేజీబీవీలో ఖాళీలు..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జాబ్‌ మేళాకు హాజరయ్యే యువతి, యువకులు ఇప్పటికే పోలీస్‌ శాఖ విడుదల చేసిన వాల్‌ పేపర్‌లోని క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా స్కాన్‌ చేస్తే బయోడేటా ఫామ్‌ ఉంటుందని, అందులో ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మెగా జాబ్‌మేళాకు హాజరయ్యే యువతి, యువకులు బయోడేటా ఫారంతోపాటు జిరాక్స్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం

పాల్గొనే కంపెనీలు: 40కి పైగా కంపెనీలు
విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/డిగ్రీ/ఎంబీఏ/బీటెక్‌/ఫార్మసీ


వేతనం: నెలకు .12 వేల నుంచి
జాబ్‌మేళా తేదీ: రేపు (మంగళవారం)
 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Oct 2024 01:44PM

Photo Stories