Ekalavya Admissions 2025 : ఏకలవ్యలో 6వ తరగతిలో ప్రవేశాలు.. పరీక్షతోనే ఎంపిక.. ముఖ్యమైన వివరాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: ఏకలవ్యలో 6వ తరగతి ప్రవేశాలకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ తన్నీరు నాగేశ్వరరావు ప్రకటించారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.
ఖాళీలు..
సింగరేణి ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రకటించిన సమాచారం ఆధారంగా.. ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏకలవ్య పాఠశాలలలో 1380 ఖాళీలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలో వారు సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటాయని వివరించారు. సింగరేణి ఏకలవ్య స్కూల్ 6వ తరగతిలో 30 మందికి బాలికలకు, 30 మంది బాలురకు ఖాళీలు ఉన్నాయన్నారు.
అర్హత..
రాష్ట్రంలోని ఏకలవ్య పాఠశాలలో చేరేందుకు గిరిజన, తల్లిదండ్రులు లేని, దివ్యాంగులైన తల్లిదండ్రులు గల విద్యార్ధులు ఐదవ తరగతి చదివి ఉండి మార్చి 2025 నాటికి 10 నుంచి 13 ఏండ్ల లోపు వయస్సు ఉండాలన్నారు.
దరఖాస్తులకు చివరి తేదీ.. ఎంపిక విధానం..
ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 16వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. విద్యార్థులకు మార్చి 16న ప్రవేశ పరీక్ష నిర్వహించి, దానిలో వచ్చిన మార్కులు ఆధారంగా రిజర్వేషన్ పాటిస్తూ విద్యార్ధుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తుల విధానం.. రుసుము..
ఆన్‌లైన్ నుంచి.. టీఎస్‌ఈఎంఆర్‌ఎస్.తెలంగాణ.జీవోవీ.ఇన్‌లో లాగిన్ అయ్యి దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షకు రుసుము రూ.100
వార్షిక ఆదాయం..
విద్యార్ధుల తల్లిదండ్రుల సంవత్సరం ఆదాయం పట్టణ ప్రాంతం రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతం వారి ఆదాయం రూ. 1.50 లక్షలు లోపు ఉండాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Admissions 2025
- ekalavya schools admissions 2025
- sixth class admissions 2025
- students education
- students eligibilities for ekalavya admissions 2025
- fifth class students
- admission test for ekalavya schools
- online applications for ekalavya schools admissions 2025
- februray 2025
- applications and admissions dates
- applications and admissions dates for ekalavya schools
- march 2025
- fifth students for ekalavya schools admissions
- Singareni Ekalavya Model School
- telangana schools admissions 2025
- telangana ekalavya schools 2025
- Education News
- Sakshi Education News
- EligibilityCriteria
- AdmissionVacancies